JrNTR: చరణ్ కూతురిని చూడటానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవడం వెనుక ఇంత కథ ఉందా?

JrNTR: రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా ఆ స్నేహం మరింత దగ్గరయింది. వీరిద్దరి అతి స్నేహం వల్ల, వీళ్ళిద్దరూ చేసే అల్లరి వల్ల షూటింగ్ చాలాసార్లు లేట్ అయింది అంటూ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి సైతం ముద్దుగా కంప్లైంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చరణ్ కి సంబంధించిన ఏ విషయం లోనైనా ఎన్టీఆర్ బాగా ఎక్సయిటెడ్ గా ఉంటాడు.

అలాగే చరణ్ దంపతులకు కూడా జూనియర్ ఎన్టీఆర్ దంపతులపై విపరీతమైన అభిమానం. అందుకే చరణ్ తండ్రి అయిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు. చరణ్ పాప కోసం ఎన్టీఆర్ దంపతులు బంగారు ఊయలని ప్రజెంట్ చేశారని అప్పుడు వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ న్యూస్ చూస్తే అది నిజం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చరణ్ వాళ్ళ పాపని చూడటానికి వెళ్ళలేదట.

 

వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అంటూ అప్పుడే కథలు కూడా అల్లేస్తున్నారు చాలామంది. ఇంతకీ జరిగిందేంటంటే ఇప్పటికే ఇద్దరు బిడ్డల తండ్రి అయిన ఎన్టీఆర్ కి పిల్లలు మీద తీసుకునే కేర్ గురించి మంచి అవగాహన ఉంది. చిన్నపిల్లల్ని ఎక్కువగా తాకితే ఇన్ఫెక్షన్లు వస్తాయని జూనియర్ ఎన్టీఆర్ కి తెలుసు. షూటింగ్ లో చాలామందిని కలిసి వర్క్ చేస్తాను.

 

కాబట్టి ఇన్ఫెక్షన్లు పాపకి అంటుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చరణ్ కూతురుని చూడటానికి వెళ్లలేదట. అలాగే చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయట వాళ్లకి పాపని చూడటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే పాపని చూసే అనుమతి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ చరణ్ కూతురుని చూడటానికి వెళ్లకపోవటం వెనుక ఇంత కథ ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు సదరు అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -