Uttar Pradesh: డ్యాన్స్‌ చేస్తుండగానే హార్ట్‌ ఎటాక్‌.. కుప్పకూలిన డాన్సర్‌

Uttar Pradesh: మనిషి జీవితం ఓ నీటి బుడగలా మారిపోయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తోందో.. ఎప్పుడు ప్రాణాలు పోతాయో.. ఎలా పోతాయో చెప్పని పరిస్థితులు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంలో రోజుకొక కొత్త కొత్త రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. వివిధ రకాల వైరస్‌లు, అంటువ్యాధులు, గుండె సంబం«ధిత వ్యాధులు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వయస్సు బేధం లేకుండా అన్ని రకాల వ్యాధులు అందరికీ సోకుతున్నాయి. ఈ మధ్య సడన్‌ స్ట్రోక్‌లతో ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అలాంటి విశాధకర ఘటన ఓ వేడుకలో జరిగి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ప్రభాత్‌ ప్రేమి (45) అనే వ్యక్తి ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఓ హోటల్‌లో నిర్వహించిన తన స్నేహితుడు మనీష్‌ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. అక్కడ ఆర్కెస్ట్రా, డీజేలతో పాటలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంచి డ్యాన్సర్‌ అయిన ప్రభాత్‌ హుషారుగా బాలీవుడ్‌ సాంగ్స్‌కు స్టెప్పులేశాడు. అది చూసి అక్కడున్న వారంతా విజిల్స్, గోలతో ఆయన్ని ఉత్సాహపరిచారు. అప్పటి వరకు బాగానే డ్యాన్స్‌ చేసిన ప్రభాత్‌ డ్యాన్స్‌ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలా కిందపడి పోగానే ప్రభాత్‌ చనిపోయినట్లు తెలుస్తోంది.

కుప్పకూలిన ప్రభాత్‌ దగ్గరకు వెళ్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు.. కానీ ఆయనలో చలనం లేదు. పార్టీలో ఉన్న మనీష్‌ మరో స్నేహితుడు డాక్టర్‌ వినోద్‌ పగ్రానీ ప్రభాత్‌కు సీపీఆర్, కార్డియాక్‌ ప్రెజర్‌ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కార్డియక్‌ అరెస్ట్‌తో ప్రభాత్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చాలామంది ఆయనకు సీపీఆర్‌ లాంటి చేసి ఉండాల్సిందన్న కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -