Naresh-Pavitra Lokesh: ఆ హీరోయిన్ మోజులో పడి పవిత్రను దూరం పెట్టిన నరేష్?

Naresh-Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల క్రితం మీడియా వార్తల్లో ఫ్రంట్ లైన్ లో నిలిచిన వారిలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు.సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగతంగా మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ముగ్గురికి విడాకులు ఇచ్చారని తద్వారా ఈయన మరొక నటి పవిత్ర లోకేష్ తో కలిసి రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఈ విధంగా వీరిద్దరూ కలిసి రిలేషన్ లో ఉండటమే కాకుండా గ్గుళ్ళు గోపురాలు కలిసి తిరగడమే కాకుండా, మా ఇద్దరి రిలేషన్ కి కృష్ణ గారి కుటుంబం సపోర్ట్ కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈ ఇద్దరు కలిసి పలు ప్రదేశాలలో సందడి చేయడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చారు.

ఈమె ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం కీలక మలుపు తిరిగింది. అసలు నరేష్ నాకు విడాకులు ఇవ్వకుండా మరొక మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ రమ్య రఘుపతి నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రమ్య రఘుపతి వ్యాఖ్యలపై నరేష్ స్పందిస్తూ తాను డబ్బు మనిషి అని డబ్బు కోసమే తనను ఎన్నో చిత్రహింసలకు గురిచేసింది అంటూ పెద్ద ఎత్తున ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.

ఇలా ఈ వివాదంతో నరేష్ పవిత్ర పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అయితే గత కొంతకాలంగా ఈ జంట ఎక్కడ కలిసి కనిపించడం లేదు.దీంతో వీరిద్దరి బంధం తెగిపోయిందా అందుకే ఎక్కడ కనిపించడం లేదు అంటూ నేటిజెన్లు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే సోషల్ మీడియా కథనాల ప్రకారం నరేష్ ఇండస్ట్రీలో ఫెడ్ అవుట్ అయిన మరొక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని,ఆమెతో రిలేషన్ లో ఉండటం వల్లే పవిత్ర లోకేష్ ను దూరం పెట్టారని తెలుస్తోంది. ఈ వివాదం తర్వాత పవిత్ర లోకేష్ కికూడా వరుస అవకాశాలు రావడంతో నరేష్ కు దూరంగా ఉంటుందని వార్తలు వినపడుతున్నాయి. మరి వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -