Actor Naresh: వైరల్ అవుతున్న సీనియర్ నరేష్ సంచలన వ్యాఖ్యలు!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని తన ముగ్గురు భార్యలను వదిలేసి తిరిగి నటి పవిత్ర లోకేష్ తో ప్రస్తుతం రిలేషన్ లో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మళ్లీ ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పెద్ద ఎత్తున వివాదం సృష్టించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా గత కొద్ది రోజుల క్రితం నరేష్ పవిత్ర లోకేష్ రమ్య రఘుపతి మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

నరేష్ పవిత్ర వ్యవహారం చూస్తే వీరు రిలేషన్ లో ఉన్నారా లేక పెళ్లి కూడా చేసుకున్నారా అనే సందేహాలు కలగక మానదు. ఈ క్రమంలోనే నరేష్ స్పందిస్తూ ప్రస్తుతం వివాహ వ్యవస్థ పై నమ్మకం కోల్పోతున్నారు. అందుకే ఎంతోమంది కోర్టు మెట్లు ఎక్కుతున్నారని తెలియజేశారు. ఇక వివాహ వ్యవస్థ పై గౌరవంతోనే మేము ఈ సినిమా చేశామని నరేష్ తెలియజేశారు.

 

పెళ్లి అనేది ఏ సాంప్రదాయంలో జరిగిన రెండు మనసులు కలిస్తేనే పెళ్లి అని ఈ సందర్భంగా నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా దాదాపు మా ఇద్దరి పెళ్లికూడా అయిపోయినట్టే అంటూ ఈ సందర్భంగా నరేష్ పవిత్రతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయగా పవిత్ర సైతం అవును అనేలాగే తల ఊపారు. ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ వారి రిలేషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -