Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ కు సిగ్గుందా.. ఇలాంటి కామెంట్లు అవసరమా?

Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మళ్లీ పెళ్లి సినిమా గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమాపై దారుణంగా నెగటివ్ కామెంట్స్ చేయడంతో పాటు ట్రోల్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ పవిత్ర లోకేష్, నరేష్ ల నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజజీవితంలో జరిగిన సంఘటనలు యధావిధిగా సినిమా రూపంలో తెరకెక్కించారు. ఇది ఇలా ఉంటే తాజాగా మళ్లీ పెళ్లి సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. అందులో నరేష్ పవిత్ర బంధంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి వ్యవహారాలను కూడా చూపించడం హాట్ టాపిక్​గా మారింది. కాగా, ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పవిత్ర లోకేష్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమకు కృష్ణ, విజయనిర్మల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. విజయకృష్ణ మూవీస్​ను రీలాంఛ్ చేయడం శుభ పరిణామమని పవిత్ర లోకేష్ అన్నారు.

 

దీనికి తెలుగువాళ్లందరూ గర్వపడతారని ఈ బ్యానర్​పై ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కాయని పవిత్ర తెలిపింది. తమ జంటకు కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు ఉంటాయన్నారామె. మళ్లీ పెళ్లి దర్శకుడు ఎంఎస్​ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ప్రతిభ ఏంటనేది అందరికీ తెలుసునని, ఇలాంటి దర్శకుడితో కలసి పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మళ్ళీ పెళ్లి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని, ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.. పవిత్ర చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సిగ్గుందా పవిత్ర నీకు ఇలాంటి కామెంట్స్ అవసరమా అంటూ మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -