Chandrababu: బాబు క్వాష్ పిటిషన్ విషయంలో భిన్న తీర్పులు.. నిప్పులా బయటపడతారా?

Chandrababu: గత ఏడాది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వాల్సిన తరుణంలో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయింది.

 

ఫ్ఐఆర్, అరెస్ట్, రిమాండ్ కు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ఆ పిటిషన్ ని హైకోర్టు తోసిపుచ్చటంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గత ఏడాది విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును మాత్రం సుదీర్ఘంగా రిజర్వ్ చేసింది.

ఇవాళ తీర్పు వెలువరించిన ధర్మాసనం భిన్న అభిప్రాయాలని వ్యక్తం చేసింది. చంద్రబాబుకు జస్టిస్ సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్ లో జస్టిస్ బేలా త్రివేది తీర్పులో తెలిపారు అలాగే ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కూడా తెలిపారు.

 

కానీ మరొక న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం ఈ తీర్పుని విభేదించారు. చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని అన్నారు. దీని ప్రకారం చంద్రబాబును సీఐడీ అరెస్టు, దిగువ కోర్టు రిమాండ్ విధించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు పై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు చివరికి చంద్రబాబు స్క్వేష్ పిటిషన్ ను సిజెఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో ఈ కేసు ఇప్పట్లో తేలేదని అభిప్రాయానికి వచ్చేసారు జనాలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -