Dil Raju: నేను రెండో పెళ్లి చేసుకోవడానికి అసలు కారణమిదే!

Dil Raju: డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించి ప్రస్తుతం స్టార్‌ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. అగ్ర హీరోలతో పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తూ హవా చాటుతున్నాడు. ఇప్పటికే 49 చిత్రాలను నిర్మించాడు. 50వ చిత్రాన్ని రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

 

ఇక దిల్‌రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2017లో ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండేళ్లకు కుటుంబసభ్యుల ఒత్తిడితో రెండో పెళ్లి చేసుకోవడం, వారికి ఓ పిల్లాడు కూడా పుట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు.

 

ఇంట్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది..
‘నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మానసికంగా చాలా ఇబ్బందిగా ఉండింది. నేను రోజంతా ఎక్కడ ఉన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతా. అలాంటిది హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో ఇంట్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు’ అని దిల్ రాజు తెలిపాడు.

ఆ తర్వాత పెళ్లి కోసం ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించామని, వైదా నాకు కరెక్ట్ అనిపించిందని చెప్పాడు. అంతకుముందు తనతో పరిచయం లేదని పేర్కొన్నాడు. ‘నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్‌లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా ఓక అనుకున్నాక పెళ్లికి రెడీ అయ్యాం. నా ఫ్యామిలీ డిస్టర్బ్‌ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా’ అని చెప్పాడు. ఇటీవలే ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్‌ రెడ్డి అని పేరు పెట్టారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -