Dimple Hayathi: ప్రత్యేక పూజలు చేస్తున్న డింపుల్ హైయతి.. ఫోటోస్ వైరల్?

Dimple Hayathi: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన జాతకం గురించి చెబుతూ లేనిపోని కాంట్రవర్సీలను కొనితెచ్చుకుంటూ ఉంటారు వేణు స్వామి. సెలబ్రిటీల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా కొందరి సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినట్టు జరగటంతో సినీ ప్రముఖులు రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి మాటల మీద నమ్మకం ఏర్పడింది.

 

అందువల్ల కొందరు సెలబ్రిటీలు వారి జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకొని మంచి అవకాశాలు అందుకోవటానికి వేణు స్వామి చేత పూజలు కూడా చేయించుకుంటున్నారు. కాగా ఇప్పటికే రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే. వేణ స్వామి చేత పూజలు చేయించడం వల్లే రష్మికకి మంచి అవకాశాలు దక్కి ఆమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మరొక హీరోయిన్ వేణు స్వామిని ఆశ్రయించి మంచి భవిష్యత్తు కోసం అతని చేత ప్రత్యేక పూజలు చేయించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు డింపుల్ హయతి.

ఖిలాడి, రామబాణం వంటి సినిమాలలో నటించిన ఈ అమ్మడికి సరైన హిట్ లభించలేదు. అందం అభినయం అన్నీ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అంతే కాకుండా ఇటీవల ఈ అమ్మడు మరొక వివాదంలో చిక్కుకుంది. ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్ద పోలీస్ అధికారితో జరిగిన వివాదం కూడా వార్తల్లో సంచలనం సృష్టించింది. ఇలా ఊహించని విధంగా డింపుల్ హయతి వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు వేణు స్వామిని సంప్రదించగా జాతకంలో దోషం ఉండడం వల్లే ఇలాంటి సమస్యలు తలేత్తినట్లు వేణు స్వామి సూచించాడని, అందువల్ల ఆయన సమక్షంలో డింపుల్ ప్రత్యేక పూజలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆ పూజకి సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -