Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్.. వైరల్ అవుతున్న వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

Mokshagna: టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత 4,5 సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అవన్నీ వట్టి రూమర్సే అని తేలిపోయాయి. మోక్షజ్ఞ ఎంట్రీ పై కూడా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఆ వార్తలపై నందమూరి ఫ్యామిలీ ఎవరు స్పందించలేదు. బాలయ్య బాబు కూడా తన కొడుకు ఎంట్రీ పై ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయం.

అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్య బాబు తన కొడుకు కోసం ఒక స్టార్ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తున్నారని, ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మోక్షజ్ఞ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లడుతూ.. నేను జాతకాన్ని చూసాను పరిశీలించాను. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల్లో బాగా రాణిస్తాడు కానీ దాదాపు 2,3 సంవత్సరాల వరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ లేదనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 

ఇప్పటికే లేట్ ఎంట్రీ అనుకున్న బాలయ్య ఫ్యాన్స్ కు మరో రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది అని వేణు స్వామి చెప్ప‌డంతో నిరుత్సాహంగా ఫీల్ అవుతున్నారు. మోక్షజ్ఞ సినిమాల్లో బాగా రాణిస్తాడు.. కానీ రాజకీయాలపై ఆసక్తి చూపించడు అంటూ వేణు స్వామి వివరించాడు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ కాయం కానీ ఇప్పుడే కాదని చెప్పడంతో కాస్త నిరాశ చెందినప్పటికీ సంతోషంగానే ఉన్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్.

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -