Venu Swamy-Sreeleela: ఆ హీరోయిన్ కు పట్టిన గతే శ్రీలీల కు కూడా పడుతుంది.. వైరల్ అవుతున్న వేణుస్వామి షాకింగ్ కామెంట్స్!

Venu Swamy-Sreeleela: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరిగిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు డైరెక్టర్ లు హీరోయిన్ శ్రీలీల వైపు ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారు. అలా ఒకరు ఇద్దరు హీరోలతో కాదు ఎంతోమంది హీరోలతో నటించడానికి ఇప్పటికే ఓకే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే పవన్ కళ్యాణ్, శ్రీ లీల, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, లాంటి హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ యంగ్ హీరోలే కాదు. సీనియర్ హీరోలు సైతం ఈమె కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈమె చేతిలో దాదాపు 12 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. చేతినిండా బోలెడు ప్రాజెక్టులు ఉండడంతో ఈ ముద్దుగుమ్మ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇది ఇలా ఉంటే శ్రీలీల నటించిన సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్న క్రమంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి, హీరోయిన్ శ్రీలీల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామి శ్రీ లీల జాతకం గురించి మాట్లాడుతూ.. శ్రీలీల జాతకం అద్భుతం. ఆమె లాంటి జాతకం చాలా తక్కువ మందికే ఉంటుంది. శ్రీలీల జాతకం ప్రకారం ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంతేకాకుండా ఈమె 2028వ సంవత్సరానికి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది. ఆమెది మీనరాశి అని ఆమెకు రాజయోగం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా టాప్ హీరోయిన్గా ఉన్న నయనతార జాతకంకు చాలా దగ్గరగా ఈమె జాతకం ఉంది. నయనతార ప్రజెంట్ ఎలాంటి క్రేజ్ తో అయితే ముందుకెళ్తుందో అలాంటి క్రేజ్ తోనే శ్రీలీల ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -