Venu Swamy: ఏపీ సీఎం జగన్ పాలన పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే?

Venu Swamy: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. పెద్దపెద్ద రాజకీయ నాయకులు నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి జీవితం గురించి వారి జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తున్నారు వేణు స్వామి. సినీ నటుల గురించి ఆయన జాతకాలు చెప్తూ ఫేమస్ అయిపోయారు. మొదట్లో ఏదో పిచ్చి కూతలు కూస్తున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చోడు అనుకున్న చాలా మంది ఆయన చెప్పిన చాలా విషయాలు నిజమవడంతో పెద్దపెద్ద సెలబ్రిటీలు కూడా ఆయనతో పూజలు చేయించుకోవడం జాతకాలు చెప్పించుకోవడం చేస్తున్నారు.

ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు వేణు స్వామి తో కలిసి పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలే నిలిచే వేణు స్వామి తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పాలన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీ లో మళ్లీ జగన్ సీఎం అవుతారని వేణు స్వామి తాజాగా చెప్పారు. అది ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ ని ఓడించలేరని, వేణు స్వామి చెప్పారు. ఏపీకి జగనే మళ్ళీ సీఎం అవుతారు అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా యాంకర్ వేణు స్వామి ప్రశ్నిస్తూ.. ఏపీకి సీఎం జగన్ అంటున్నారు.

 

ఏపీని అప్పుల ఊబిలోకి అయిన నెట్టారని రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాల అంటే, ఈసారి ఎన్నికల్లో ఓడిపోతారని అంటున్నారు. మరి మీరు మళ్లీ జగన్ సీఎం అవుతారని ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు. ఎవరెన్ని చెప్పినా కూడా వచ్చే సంవత్సరంలో తిరిగి ఎన్నికలలో జగన్ గెలిచి జగనే సీఎం అవుతారు అంటూ బల్ల గుద్ది చెప్పారు వేణు స్వామి. అస్సలు చంద్రబాబు సీఎం అయితే అవ్వలేడని చెప్పేశారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ మొదలైందని, 17 ఏళ్లు ఆయన్ని ఎవరు కూడా కదిలించలేరని ఆయన చెప్పారు. 17 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉంటారని వేణు స్వామి చెప్పారు అంటే ఈ లెక్కన 2029 వరకు కూడా జగన్ సీఎం గా ఉండచ్చని అర్ధం అవుతోంది. 17 ఏళ్ల తర్వాత జగన్ కి కొన్ని గండాలు ఉన్నాయట.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -