Nandamuri Mokshagna: త్వరలో ఆ సినిమాతో బాలయ్య వారసుడు ఎంట్రీ?

Nandamuri Mokshagna: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్న బాలయ్య.. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక బాలయ్య ప్రత్యేక మేనరిజానికి ఎంతోమంది కుర్ర కారు ఊగిపోతూ ఉంటారు.

మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య వారసుడైనటువంటి మోక్షజ్ఞ మనందరికీ తెలుసు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.

కానీ ఈ విషయం గురించి అప్పట్లో బాలయ్య స్పందించలేదు. కానీ తాజాగా బాలయ్య ఒక అద్భుతమైన వార్తను బయటపెట్టాడు. త్వరలో మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటన, శిక్షణతో పాటు డాన్సులు కూడా నేర్చుకుంటున్నాడని బాలయ్య స్వయంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశాడు.

దాంతో ఇండస్ట్రీ సమాచారాల ప్రకారం మోక్షజ్ఞ సినిమా గురించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ దర్శకుడు.. మోక్షజ్ఞతో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూడా ఈ అద్భుత అవకాశాన్ని రాహుల్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక దర్శకదీరుడు రాజమౌళికి మంచి ర్యాపో వ్యక్తి.. సాయి కొర్రపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని మరో స్థాయిలో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. ఇక డైరెక్టర్ రాహుల్ కూడా అదే ఊపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా టైటిల్ ని కూడా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రేమించి చూడు అనే టైటిల్ నుంచి సాఫ్ట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -