Ravi Babu: 73 ఏళ్ల వయస్సున్న పెద్దాయనను జైల్లో పెట్టి హింసించడం దారుణం.. రవిబాబు కామెంట్స్ వైరల్!

Ravi Babu: చంద్రబాబు నాయుడు ఆరెస్టుపై పదిమంది పది రకాలుగా స్పందిస్తున్నారు. అనుకూల వర్గం వారు చంద్రబాబునికి మద్దతునిస్తూ,ప్రతికూల వర్గం వారు చంద్రబాబుని శాపనార్ధాలు పెడుతూ తమ స్పందనని తెలియజేస్తున్నారు. అలాగే నటుడు, దర్శకుడు అయిన రవి బాబు కూడా తన స్పందనని వీడియో రూపంలో తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.

రాజకీయ నాయకుల పవర్ గాని సినిమా వాళ్ళ గ్లామర్ గానీ అలాగే చంద్రబాబు నాయుడుకి వచ్చిన కష్టాలు కానీ ఏవి శాశ్వతం కాదు. చంద్రబాబు గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి దగ్గరి ఆప్తులు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఏ పని చేసినా 100 యాంగిల్స్ లో ఆలోచిస్తారు. దానిపై అందరిని సంప్రదించి ఎవరికి ఇబ్బంది కలగకుండా డెసిషన్ తీసుకుంటారు. ఆయనకి ఈ రోజే లాస్ట్ రోజు అని తెలిస్తే నెక్స్ట్ 50 సంవత్సరాల సంబంధించిన సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్ చేస్తారు.

అలాంటి వ్యక్తిని ఆధారాలు లేకుండా జైల్లో పెట్టడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కానీ 73 ఏళ్ల వయసు వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం చాలా దారుణం. అశాశ్వతమైన పవర్ ఉన్నవారికి నా హంబుల్ రిక్వెస్ట్..మీరు ఏ పవర్ ని వాడి ఆయనను జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్ వాడి ఆయనను బయటకు తీసుకురండి. మీరు చిటికె వేస్తే సరిపోతుందని అందరికీ తెలుసు. ఆయనను బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి.

ఆయన దేశం దాటిపోయే మనిషి అయితే కాదు. ఆలోచించండి చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయి వాళ్ళ లాగానా లేక ప్రేమ కురిపించే ఒక నాయకుడిగానా అనేది మీరే ఆలోచించుకోండి అంటూ రవి బాబు పెట్టిన రిక్వెస్ట్ ఇప్పుడు తెగ

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -