Romance: ఈ ఆసనాలు వేస్తే రొమాన్స్ బాగా చేస్తారట?

Romance: ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగా ఉండటం తో పాటు మానసిక ప్రశాంతత పూర్తి లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే యోగా చేస్తే శృంగార జీవితం అభివృద్ధి అవుతుంది. మరి ఎటువంటి ఆసనాలు వేస్తే మంచిది. శృంగారం బాగా చేయాలన్నారు రొమాన్స్ బాగా చేయాలన్నా అందుకోసం ఎటువంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ​కపాలభాతి ప్రాణాయామ.. ఇది ఒత్తిడిని దూరం చేయడానికి సహాయపడుతుంది. యోగాను చేయడం వల్ల కార్టిసోల్ లెవెల్స్ తగ్గుతాయి. ఒత్తిడి పెరిగి పోవడం వల్ల శృంగార కోరికలు తగ్గిపోతాయి.

 

డైలీ యోగా చేస్తే ఒత్తిడి దూరమై శృంగార కోరికలు పెరుగుతాయి. కపాలబాతి ఎంతో ముఖ్యమైన ప్రాణాయామం. దీనివల్ల బ్రీతింగ్ కూడా బాగుంటుంది. ఏకాగ్రతతో ప్రాణాయామం చేయడం ఎంతో అవసరం. అప్పుడే దాని ఫలితంని సరిగ్గా పొందడానికి అవుతుంది. శరీరం యాక్టివేట్ అయ్యేందుకు కపాలభాతి ప్రాణాయామ ఉపయోగపడుతుంది. కపాలబాతి ప్రాణాయామ ఆసనం ఎలా చేయాలి అన్న విషయానికొస్తే..

ఒకచోట కూర్చొని తర్వాత చేతులను మోకాళ్ళ పైకి వచ్చేలా చేయండి. అలాగే మీ అర చేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టాల్సి వుంది. తర్వాత గట్టిగా శ్వాస తీసుకొని బొడ్డు భాగాన్ని వెనుకకు నెట్టి మాత్రమే ఊపిరి వదలాలి. ఊపిరి వదిలే సమయంలో మీ కుడిచేయిని కడుపు భాగంపై పెట్టి అబ్డామినల్ మజిల్స్ ఎలా కాంట్రాక్ట్ అవుతున్నాయనేది గమనించాలి.

లిజార్డ్ పోజ్: తరచుగా ఈ ఆసనం వేయడం వల్ల మీ రొమాంటిక్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆసనంని రోజూ వేయడానికి సమయం కేటాయించడం వల్ల మీ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ఇక ఈ ఆసనాన్ని ఎలా వేయాలి అన్న విషయానికి వస్తే.. మొదట మీరు రెండు కాళ్లు రెండు చేతులలో ఒక పాదాన్ని ముందుకు పెట్టాలి.
మీ చేతులు రెండు రెండు పక్కల ఉండేలా చూసుకోవాలి. తర్వాత మీ వెనక ఉండే మోకాళ్ళని కిందకు దించాలి. తరువాత మీ హిప్స్‌ని కిందకి ఉండేలా చూసుకోవాలి. మీరు చెస్ట్ లిఫ్ట్ చేసినప్పుడు మోచేతులు కిందకి ఉండాలి. రెండు నిమిషాల పాటు శ్వాస తీసుకొని మీరు రెడీ అనుకున్నప్పుడు నెమ్మదిగా శ్వాసని వదలాలీ.

 

ఆనంద బాలాసనం: ఈ ఆసనం వేయడం వల్ల సెక్సువల్ ఆర్గాన్స్ కి బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తుంది. అలానే ఈ ఆసనం వేయడం వల్ల పొజిషన్స్ మీకు సులభంగా ఉంటాయి. శృంగార జీవితం బాగుండాలంటే ఈ ఆసనం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆసనం ఎలా వేయాలంటే.. మొదట మీరు వెన్నెముక నేల మీదకి ఉండేటట్టు పడుకోవాలి మీ మోకాళ్ళను కిందకి వంచండి. మీ పొట్ట దగ్గరికి మోకాళ్ళు రావాలి.
ఇప్పుడు మీ పాదాలను మీ చేతులతో తాకండి.

మీ పాదాలు రెండూ దూరంగా ఉండాలి. మీ మోకాళ్ళను కూడా వైడ్‌గా ఉంచాలి. మీ పాదాలని మీరు చేతులతో తాకినప్పుడు పైకి ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల శృంగార జీవితం బాగుంటుంది.

 

శవాసనం: శవాసనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా మంది ఈ పొజిషన్ లో ఎక్కువసేపు ఉంటారు. ఈ ఆసనం వల్ల మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. అలానే ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. చక్కగా మీరు నేల మీద వీపు కిందకి ఉండేటట్టు పడుకుని శ్వాస తీసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళని మూయండి. ఈ ఆసనం వేసినప్పుడు కాళ్లు చేతులు అన్ని కూడా రిలాక్స్ గా ఉంటాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -