Mother’s Womb: ఈ మూడు విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటామా.. ఏమైందంటే?

Mother’s Womb: సాధారణంగా మహిళలు గర్భంతో ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భంతో ఉన్న మహిళలు ఎంత ప్రశాంతంగా ఉంటే వారికి పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు. ఇలా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం తల్లి ప్రెగ్నెంట్ అయిన సమయంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే ఏదైనా స్టోరీ కథలు చదవడం, సంగీతం వినడం, ఆధ్యాత్మికత పుస్తకాలు చదవడం వంటివి చేస్తుంటారు.

ఇలా చేయడం వల్ల భారీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా పుట్టబోయే బిడ్డ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని వారి ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు. ఇకపోతే తాజాగా గర్భిణీ స్త్రీలపై జరిపిన పరిశోధనలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని విషయాలను గ్రహిస్తారని నిపుణులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ మూడు విషయాలను బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటుందని నిపుణులు వెల్లడించారు.

 

తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏ ఏ విషయాలను గ్రహిస్తుంది అనే విషయానికి వస్తే వినికిడి, శబ్దాలను గ్రహించడం,అలాగే రుచిని తెలుసుకోవడం వంటివి తల్లి కడుపులో ఉన్న సమయంలోనే బిడ్డ గ్రహిస్తుందని ఈ పరిశోధన ద్వారా తెలియజేశారు.బిడ్డ కడుపులో ఉన్న సమయంలో తల్లి ఏ ఆహార పదార్థాలు అయితే రుచిగా తింటుందో ఆహార పదార్థాలను బిడ్డ కూడా అమితంగా ఇష్టపడుతున్నట్లు తెలియజేశారు.

 

మన పరిసర ప్రాంతాలలో అధికంగా శబ్దాలు కనుక ఉంటే ఆ శబ్దాల కారణంగా కడుపులోని బిడ్డ కదులుతుంది అలాగే బిడ్డ ఏదైనా కానీ శబ్దాలను తొందరగా గ్రహిస్తారు. ఈ క్రమంలోనే తన తండ్రి లేదా తల్లి మాట్లాడుతున్నప్పుడు వెంటనే వారి మాటలకు రెస్పాండ్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి.ఇలా కడుపులో ఉండగానే బిడ్డ ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తుందని తాజాగా న్యూయర్క్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -