Diabetes: షుగర్ ఉన్నవారు కాఫీ టీలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Diabetes: ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఏడుగురు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు.. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక రకాల ఆహార పదార్థాల కారణంగా ఐదు సంవత్సరాల లోపు 10 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు కూడా డయాబెటిస్ వస్తోంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు ఎటువంటి ఆహార పదార్థాలు పానీయాలు తినాలి అన్నా తాగాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అని భయపడి ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉంటారు.

 

అయితే షుగర్ పేషెంట్ లు కాఫీ టీలు తాగవచ్చా. ఈ ప్రశ్న అనేక మందిలో తలెత్తే ఉంటుంది. కొంతమంది కాఫీ టీ లపై ఉన్న పిచ్చితో రోజు కనీసం ఒక్కసారైనా తాగకుండా ఉండలేరు. కొంతమంది ఇష్టం ఉన్నా కూడా డయాబెటిస్ కారణంగా మానేస్తూ ఉంటారు. మరి డయాబెటిస్ పేషెంట్లు కాఫీ తాగవచ్చో తాగు కూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కెఫిన్ కంటెంట్ డయాబెటిస్ ఉన్న వారు వారి రెగ్యులర్ డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేవగాని పరగడుపుతో అందులోను పంచదార కలిపిన టీ, కాఫీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే రెండింటిలోనూ కెఫిన్ అధిక మోతాదులో ఉంటుంది.

కాగా కొన్ని అధ్యయనాల ప్రకారం డయాబెటిస్ ఉన్న వారు మితంగా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్ కాఫీ తాగడం వల్ల కాఫీలో కెఫిన్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే కెఫిన్ కంటెంట్ ఉన్న కాఫీ, టీని పంచదార కలపకుండా రోజుకు ఒక సారి మితంగా తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా డయాబెటిస్ లేనివారు కూడా రెగ్యులర్ గా కాఫీ తాగితే రానున్న రోజుల్లో ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువట. ఒకవేళ మీరు ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నట్లయితే ఇటువంటి కెఫిన్ పానీయాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా రోజూ తీసుకునే టీ-కాఫీలో చక్కెరను కలపకూడదు. లేకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. మధుమేహం కూడా నియంత్రణలో ఉండదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -