Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే జాగ్రత్త?

Money Plant: ఈ మధ్య కాలంలో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో చాలామంది వాస్తు ప్రకారంగా ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటున్నారు. చాలామంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం వాస్తు చిట్కాలను పాటిస్తూనే ఉన్నారు. ఎంత సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు అని బాధపడేవారు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తున్నారు. అయితే వాస్తు విషయాలను పాటించే వాటిలో ముఖ్యంగా మనీ ప్లాంట్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ ప్లాంట్ తప్పకుండా కనిపిస్తూనే ఉంటుంది. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క నాటడం ద్వారా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

అంతే కాకుండా లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే మనీ ప్లాంట్ ని పెంచుకోవడం మంచిదే కానీ మనీ ప్లాంట్ విషయంలో కొన్ని రకాల పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఇందుకోసం మీరు మనీ ప్లాంట్ మొక్కను సరైన దిశలో నాటాలి. ఈ మనీ ప్లాంట్ సరైన దిశలో ఉండకపోతే ఆర్ధిక నష్టం కలుగుతుంది. అలాగే ఇల్లు కూడా ప్రతికూలంగా మారుతుంది. అందుకే మనీ ప్లాంట్ ను ఎప్పుడు కూడా ఆగ్నేయ ముఖంగా ఉంచాలి. అలాగే మనీ ప్లాంట్ ఎదిగే సమయంలో కొమ్మలు నేలను తాకకుండా చూసుకోవాలి తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలాగా వేయాలి. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభ సూచకంగా భావిస్తారు.

 

మనీ ప్లాంట్ లక్ష్మి దేవి అభివ్యక్తి అని చెబుతూ ఉంటారు. అందుకే కొమ్మలు ఎప్పుడు కూడా నేలను తాకకుండా చూసుకోవాలి. అలాగే ఈ మనీ ప్లాంట్ ను ఎల్లవేళలా ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి బయట నటితే దురదృష్టం అని చెబుతుంటారు. ఎందుకంటె బయట సూర్యరశ్మి ఎక్కువుగా ఉండటం వల్ల మొక్క పెరుగుదల సరిగా ఉండదు. తద్వారా అందుకే ఆర్ధిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎండిపోవడం మంచిది కాదు. అది మీ వినాశనానికి సంకేతంగా చెప్పవచ్చు. అది మీ ఇంటి ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే మనీ ప్లాంట్ ఎండిపోకుండా చేసుకోవాలి. అలాగే మనీ ప్లాంట్ ఎవ్వరికి ఇవ్వకూడదు. అలా చేస్తే శుక్ర గ్రహానికి కోపం వచ్చి మీ నుండి సంపద, శ్రేయస్సు ను లాగేసుకుంటాడట.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -