TDP: ఈ టీడీపీ రేసుగుర్రాల గురించి తెలుసా.. ఎన్నికల్లో వీళ్లదే విజయమంటూ?

TDP: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన తొలి విడత చర్చలు పూర్తయ్యాయి. లిస్ట్ కూర్పు పై ఇప్పటికే టీడీపీ కసరత్తు కంప్లీట్ అయ్యింది. సీట్ల సర్దుబాటుపై సంక్రాంతికి ముందే టీడీపీ-జనసేన కూటమి చర్చలు జరపగా, పండగ తర్వాత ఎనీ టైమ్ లిస్టును విడుదల చేయనున్నారు. అలా మొత్తానికి టీడీపీ రేసు గుర్రాలు రెడీ అయినట్లు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలక్షన్స్‌కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి ఎలా అయినా గెలవాలి అని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను మొదలు పెట్టింది.

 

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ క్రమంలోనే 72 మందితో కూడిన జాబితాను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్న టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై దాదాపు ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకు కేటాయించనున్న స్థానాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగానే చంద్రబాబు జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో గెలుపొందగా.. ఆ తర్వాత అందులోంచి నలుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేరిపోయారు.

ప్రస్తుతం టీడీపీకి 19 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. జాబితాలో 14 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలాబలాలపై పలు నివేదికలను పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, ప్రజల్లో అభ్యర్థులపై ఉన్న ఆదరాభిమానాలను బేరీజు వేసుకుంటూ ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పులను గమనిస్తూనే.. అందుకు తగినట్లుగా ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -