Nani: నానిని పనికిరావని అవమానించిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Nani: నేచురల్‌ స్టార్‌ నాని తన రూట్‌ మార్చి ఇప్పుడు దసరా చిత్రంలో నటించారు.దీన్ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. తనకు బలమైన ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టి మాస్‌ మూవీ చేశాడు నాని. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తన స్ట్రగుల్స్ గురించి ఓపెన్‌ అయ్యారు నాని.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తాను క్లాప్‌ బాయ్‌ గా ఉండేవాడట.ఆ సమయంలో ఓ దర్శకుడు తనని చాలా అవమానించాడని చెప్పారు. క్లాప్‌ బాయ్‌ తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పాడు. క్లాప్‌ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారు. నీకు ఎవరు పడితే వాళ్లు పనులు చెబుతుంటారు. ఇష్టం వచ్చిన మాటలు అనేవారని, వారందరికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా చెప్పలేని స్థితి, అన్నింటిని దిగమింగక తప్పదని నాని తెలిపారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు తాను ఫేస్‌ చేసినట్టు చెప్పారు.

 

అయితే తనని మాటలు అన్నందుకు ఎప్పుడూ బాధపడలేదట, కానీ ఓ దర్శకుడు మాత్రం సెట్‌ అందరి ముందు తనని అవమానించాడట. తాను ఎప్పటికీ దర్శకుడిని కాలేనని అన్నాడు. ఆ మాట తనని తీవ్రంగా మనో వేదనకు గురి చేసిందని, ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పాడు నాని. స్టార్‌ అయ్యాక ఆ దర్శకుడిని కలిశా, అప్పుడు కూడా మా చుట్టూ ఉన్న వాతావరణం చెప్పుకోదగిన విధంగా లేదని నేచురల్‌ స్టార్‌ వెల్లడించారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -