Pot Water: మట్టి కుండలో నీటి వల్ల ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Pot Water: ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి.. దీంతో అలా ఒక కొద్ది సేపు బయట తిరిగి వచ్చారు అంటే చాలు వెంటనే చల్లని నీరు చల్లని పానీయాలు తాగాలని అనుకుంటూ ఉంటారు. అయితే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఫ్రిడ్జ్ ల వాడకం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ లు కనిపిస్తున్నాయి. కానీ పూర్వం రోజుల్లో మాత్రం ఎంచక్కా వేసవికాలంలో మట్టికుండలో నీటిని తాగేవారు. మట్టికుండ చుట్టూ ఇసుక పోసి ఆ కుండ చుట్టూ కానిగచెట్టు ఆకులను కట్టి ఒక బట్ట లాంటిది చుట్టి తరచూ వాటిని తెలుపుతూ ఉండడం వల్ల ఆ కుండలో నీరు చాలా చల్లగా మారిపోతాయి. అలాంటివి కట్టకపోయినా కూడా కుండలో నీరు ఎప్పుడూ చల్లగా ఉంటాయి.

కానీ చాలామంది కుండలో నీటి కంటే ఫ్రిడ్జ్ లో నీటిని తాగడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దానివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల ఎటువంటి సమస్యలు దరి చేరవు. అందుకే వేసవిలో ఎక్కువగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. మట్టి కుండలో నీటిని తాగడం వల్ల దాహం తీరడంతో పాటు మంచి మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి.. మరి మట్టి కుండలోని నీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజ శీతలీకరణ మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది.

ఒక మట్టి కుండ ఉపరితలంపై చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా నీరు త్వరగా ఆవిరైపోతుంది. బాష్పీభవన ప్రక్రియ కుండలోపల ఉన్న నీరు వేడిని కోల్పోయేలా చేస్తుంది, ఇది నీటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మట్టి కుండలలో కాల్షియం, ఐరన్ , మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు, అది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించగల ఈ ఖనిజాలను గ్రహిస్తుంది. ఇది మనస్సు, శరీరాన్ని నయం చేసే భూమి యొక్క విద్యుదయస్కాంత లక్షణాలను కూడా కలిగి ఉంది. వేడి నుండి దూరంగా ఉంచుతుంది ఎండలు ఎక్కువగా ఉంటే ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు.

చాలా మందికి వేడి కారణంగా తల తిరుగుతుంది. అలాంటి వారు మట్టి కుండలోని నీటిని తాగాలి. కుండలో ఉండే పోషకాలు కూడా శరీరానికి చేరుతాయి. దీంతో శరీరం ఫిట్‌గా ఉంటుంది. గొంతుకు కూడా మంచిది వేసవిలో చాలా మంది ఫ్రిజ్‌లోని నీటిని తాగుతుంటారు. కానీ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగిన తర్వాత చల్లగా మారి గొంతు నొప్పి వస్తుంది. కానీ కుండలోని నీరు ఫ్రిజ్‌లోని నీళ్లంత చల్లగా ఉండకపోయినా, తాగడానికి సరిపడా చల్లగా ఉంటుంది. ఇది గొంతు నొప్పిని కలిగించదు. రుచిని పెంచుతుంది మట్టి కుండల నుండి నీటిని తాగడం వల్ల నీటి రుచి గణనీయంగా పెరుగుతుంది. కుండలోని నీరు జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది జీవక్రియను పెంచడానికి కూడా పనిచేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో బిస్ ఫినాల్ వంటి విష రసాయనాలు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -