Water: మితిమీరి నీటిని తాగుతున్నారా.. ఆ సమస్య రావడం ఖాయం?

Water: భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికి కూడా నీరు అన్నది చాలా ముఖ్యం. నీరు లేకుండా ఒక్క ప్రాణి అయినా మనుగడ సాధించడం అసాధ్యం అని చెప్పవచ్చు. మానవ శరీరంలో దాదాపు 60 శాతం నీళ్లు ఉంటాయి. ఎండాకాలంలో బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండడం కోసం చాలామంది పరిమితికి మించి ఎక్కువగా తాగుతూ ఉంటారు. మంచినీటిని తాగడం మంచిదే కానీ పరిమితికి మించి తాగడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నీరు మన ఒంట్లోని ప్రతి కణానికీ పోషకాలను మోసుకెళ్లడంతో పాటు అక్కడి విష పదార్థాలను కూడా తొలగిస్తుంది. శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత తగ్గకుండా, పెరగకుండా ఎంత ఉండాలో అంతే మెయిన్టెయిన్ చేస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలి అంటే నీటిని తాగడం మంచిదే కానీ తగినన్ని నీరు మాత్రమే తాగాలి. మోతాదుకు నుంచి ఎక్కువ తాగడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇకపోతే రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి అనేది ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిలో వయసు జీవనశెలి పై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మంచినీటిని ఎన్నిసార్లు ఎంత గ్యాప్ లో తాగుతున్నాము అన్నది కూడా మనం మూత్రపిండాల విసర్జన పనితీరులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. మూత్రపిండాలు గంటకు ఒక లీటర్ నీటిని అదనంగా విసర్జించాలంటే ఇదే ముఖ్యం. చాలా మంది అవసరం లేకపోయినా కూడా గంట గంటకి నీటిని తాగుతూ ఉంటారు.

 

అలా అతి తక్కువ సమయంలో 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగితే హైపోనాట్రెమియా అనే సమస్య తలెత్తుతుంది. రక్తంలో సోడియం గాఢత తగ్గటాన్ని హైపోనాట్రెమియా అంటారు. ఎక్కువ నీళ్లు తాగటం వాటర్ ఇన్ టాక్సికేషన్ అనే స్థితికి దారితీస్తుంది. రక్తంలోని సోడియం లెవల్స్ ప్రమాదకరమైన తక్కువ స్థాయికి పడిపోవటమే వాటర్ ఇన్ టాక్సికేషన్. రక్తంలో సోడియం స్థాయిలు తగినంత లేకుంటే శరీర కణాల్లోని ద్రవాల బ్యాలెన్స్ ని మెయిన్టెయిన్ చేయడం చాలా కష్టం. ఫలితంగా మెదడులో వాపు వస్తుంది. దాంతో కోమాలోకి పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రతి రోజూ సాధారణంగా కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. వ్యక్తి చేసే శారీరక శ్రమను బట్టి ఇది మారుతూ ఉంటుంది. రోజూ ఇంట్లోనే నీడ పట్టున ఉండేవాళ్లకు దప్పిక కాస్త తక్కువే. అదే రోజంతా ఎండలో పనిచేసేవాళ్లు కనీసం అర్ధ గంటకోసారైనా వాటర్ తాగుతారు. లేకపోతే వాళ్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -