Health Tips: తరచూ పల్లీలు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

Health Tips: పల్లీలను చూస్తే తినకుండా ఎవరు ఆగలేరు…పల్లీలను చూస్తే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు టక్కున నోట్లో వేసుకొని తినేస్తాము.కొందరు వీటిని పచ్చిగా తింటే మరికొందరు కాల్చుకొని మరికొందరు ఉప్పు వేసుకుని ఉడకబెట్టి తింటారు.ఇక పల్లీలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో అధిక శాతం పోషకాలు ఉండటం వల్ల శరీరానికి ఎన్నో పోషక విలువలను అందిస్తుంది. ఇలా పల్లీలను తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే ఎంతో ఆరోగ్యకరమైన ఈ పల్లీలను తిన్న వెంటనే నీళ్లు తాగితే కనుక మనము కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మన ఇంట్లో పెద్దవాళ్లు కూడా పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు వస్తుంది తాగకూడదని చెబుతుంటారు. మరి పల్లీలు తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగుకూడదు ఒకవేళ తాగితే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..

 

మనం తీసుకున్న పల్లీలలో ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది అయితే పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల ఆ నీరు ఆయిల్ తో కలిసిపోయి మన ఆహారనాలంలో కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే పల్లీలు తిన్న వెంటనే నీరు తాగకూడదని చెబుతున్నారు. పల్లీలు సహజంగా వేడిని కలిగి ఉంటాయి.ఈ సమయంలో మనం నీటిని తాగడం వల్ల అవి చల్లగా మారిపోతాయి ఇలా శరీరంలో వేడి చలువ పదార్థాలు ఒకచోట నొసగవు కనుక మనకు దగ్గు రావడానికి కారణం అవుతాయి.

 

పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగటం వల్ల అవి తొందరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ అజీర్తి కలగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పల్లీలను తిన్న తర్వాత వెంటనే నీటిని తాగకుండా 15 నుంచి20 తర్వాత తాగాలి.అది కూడా కాస్త గోరువెచ్చగా ఉన్న నీటిని తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం కూడా చాలా తొందరగా జీర్ణం అవుతుంది. అందుకే పల్లీలను తినేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -