Heroes: ఈ హీరోలు ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చారని తెలుసా?

Heroes: సాధారణంగా తల్లిదండ్రులు ఏ వృత్తిలో అయితే స్థిరపడతారో తమ పిల్లలని కూడా అదే వృత్తిలోకి తీసుకురావాలని భావిస్తుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా తమ తల్లిదండ్రులు వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం వారికి ఇష్టం లేకపోవడంతో పిల్లలకు ఇష్టమైన రంగంలో వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇకపోతే మరికొందరికి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఇష్టం లేకపోయినా కొన్ని పరిస్థితుల కారణంగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు.

ఈ విధంగా హీరోలుగా నటించడం ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వారిలో ఈ హీరోలు కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజుకు కొడుకులు లేరు. ఈ క్రమంలోనే ఆయన తన సోదరుడు కుమారుడు ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

 

 

ఇండస్ట్రీలోకి రావడం ప్రభాస్ కి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తన పెదనాన్న బలవంతంగా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి నేడు పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్యకు కూడా ఇండస్ట్రీలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

 

 

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కి కూడా ఇండస్ట్రీలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని అయితే తన అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ బలవంతంతోనే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -