Rock Salt: రాళ్ళ ఉప్పువల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా?

Rock Salt: సాధారణంగా చాలావరకు వంటకాలలో ఉప్పు లేకపోతే వంటలు పూర్తవడం పక్కన పెడితే ఆ వంటకాన్ని కనీసం తినలేము. ఎన్ని రుచికరమైన పదార్థాలు వేసిన కూడా ఉప్పు తక్కువ అయితే ఆ వంటకం రుచి మారిపోతుందని చెప్పవచ్చు. అలా అని ఉప్పు ఎక్కువ వేసినా కూడా ఆ వంటకం చెడిపోతుంది. అయితే మనం నిత్యం రాళ్ల ఉప్పు లేదా నైస్ ఉప్పు ఈ రెండు రకాల ఉప్పులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. రాళ్ల ఉప్పు కంటే రాక్ సాల్ట్ శరీరానికి మంచి చేస్తుందట. రాక్ సాల్ట్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇతర లవణాలతో పోలిస్తే ఈ ఉప్పులో ఇనుము తక్కువుగా ఉంటుంది.

దాదాపు 99 శాతం ఖనిజాలు ఉంటాయి వీటితో పాటు కాల్షియం, జింక్, పొటాషియం వంటి మూలకాలు కూడా ఉన్నాయి. ఈ సాల్ట్ బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరు ఎదుర్కొనే సమస్య బరువు ఎక్కువుగా ఉండడం. కాబట్టి ఊబకాయం తగ్గించుకోవాలంటే తెల్ల ఉప్పుకి బదులుగా రాతి ఉప్పును ఉపయోగిస్తే అది మీ బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాగా ఈ రాక్ సాల్ట్ లో ఉండే పదార్ధాలు అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. బీపీ డౌన్ అయ్యి శరీరం నీరసించి పోయినప్పుడు రాక్ సాల్ట్ ను మజ్జిగలో వేసుకుని తాగమని చెబుతూ ఉంటారు.

 

కానీ మనం నిత్యం ఉపయోగించే సాదా ఉప్పు శరీరానికి చాలా హాని చేస్తుంది. అందుకే రాక్ సాల్ట్ వాడటం మంచిది. రాక్ సాల్ట్ బిపి ని అదుపులో ఉంచడంతోపాటు కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే నిద్రలేమి, ఉబ్బసం, మధుమేహం, కిడ్నీలో రాళ్ళూ వంటి సమస్యలకు రాళ్ల ఉప్పు తీసుకోవడం ఉత్తమం. రాతి ఉప్పు తినడం వల్ల శరీరంలో మెలటోనిన్, సెరోటోనిన్ హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది, దీని కారణంగా టెన్షన్ తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు రాతి ఉప్పును తినాలి. ఎందుకంటే ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాతి ఉప్పు తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని వల్ల కండరాల తిమ్మిరి సమస్య ఉండదు. నిమ్మరసంలో రాళ్ల ఉప్పు కలిపి తాగితే శరీరంలో రాళ్లు కరుగుతాయి.

 

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -