Ali: అలీ అల్లుడి గురించి ఈ కళ్లు చెదిరే నిజాలు తెలుసా?

Ali: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా అలీ ఓ వెలుగు వెలిగాడు. ఆయనకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన అలీ ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ టాప్ కమెడియన్ గా పేరు పొందారు. ఇప్పుడున్న కమెడియన్లలో బ్రహ్మానందం తర్వాత అలీ తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. అలీ హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించారు.

 

తాజాగా అలీ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. తన స్టైల్ లో ముందుకు సాగుతూ రాజకీయాల్లో ప్రజాదరణ పొందుతున్నారు. తాజాగా అలీ పెద్ద కూతురి వివాహం అయ్యింది. స్టార్ కమెడియన్ అయినా కూడా తన కూతురికి కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అలీ అల్లుడు డాక్టర్ అని, ఆయన కూడా మంచి సౌండ్ పార్టీ అని కొన్ని వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి.

ఈ మధ్యనే అలీతో సరదాగా షో ఫైనల్ ఎపిసోడ్ కు సుమ హోస్ట్ గా అలీ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో అతీని సుమా కొన్ని ప్రశ్నలు అడిగారు. అలీని సుమ మీ అల్లుడు డాక్టర్ అంటూ అడగటంతో అలీ క్లారిటీ ఇచ్చారు.

 

తన అల్లుడు రోబోటిక్ ఇంజినీర్ అని అలీ తెలిపాడు. వాళ్ళ నాన్న, అన్నా, వదిన, చెల్లి, బావ అందరూ డాక్టర్లే అని తన అల్లుడు మాత్రం రోబోట్ ఇంజినీర్ అని వెల్లడించారు. తన అల్లుడు మంచి మనసున్న వ్యక్తి అని, అందుకే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిపాడు. దీంతో అలీ అల్లుడు డాక్టర్ అంటున్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. ఏదేమైనా సరే అలీ కూతురికి మంచి భర్త దొరికాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -