Lorry Driver: లారి డ్రైవర్ విలన్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Lorry Driver: ప్రస్తుత కాలంలో విలన్స్ అంటే హీరోల కంటే చాలా హ్యాండ్సమ్ గాను, హీరోలతో పాటు సమానంగా రెమ్యూనరేషన్ ఇస్తూ విలన్లను సినిమాలలోకి తీసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు విలన్స్ అంటేనే ప్రేక్షకులు భయపడే రేంజ్ లో ఉండేవారు. భారీ శరీర కాయం, కన్నింగ్ తెలివితేటలతో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చూడగానే భయం వేసేలా విలన్స్ ఉండేవారు. ప్రస్తుత కాలంలో విలన్స్ హీరోల కంటే చాలా అందంగా ఉన్నారని చెప్పాలి.

అయితే బాలకృష్ణ హీరోగా నటించిన లారీ డ్రైవర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో విలన్ పాత్రలో నటుడు మోహన్ రాజా నటించారు. అప్పట్లో ఈయన విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోల సినిమాలలో నటించి పెద్ద ఎత్తున హీరోలతో పోటీ పడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో విలన్ పాత్రలలో నటించిన మోహన్ రాజా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే…

 

మోహన్ రాజా స్వస్థలం కేరళ. తిరువనంతపురం. ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ చదివాడు. ఇలా చదువు పూర్తయిన అనంతరం ఈయన సినిమాలలోకి విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇలా సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాష చిత్రాలలో మోహన్ రాజా నటించారు. అలాగే కొన్ని మలయాళ సీరియల్స్ లో కూడా ఈయన నటించారు. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

 

ఈయన ప్రస్తుతం మధురైలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మోహన్‌ రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు జైష్మ, కావియా సంతానం ఉన్నారు.ఇలా సినిమాలకు దూరమైనటువంటి ఈయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మధురైలో నివాసం ఉంటున్నారు. ఇక ఈయన తెలుగులో చివరిగా నటించిన చిత్రం నరసింహనాయుడు ఈ సినిమా తర్వాత ఈయన తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -