Chandrababu: చంద్రబాబు గొప్పదనం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి మనందరికీ తెలిసిందే. అయితే చాలామందికి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాల గురించి ఆయన ఎక్కడ పుట్టాడు అన్న విషయాల గురించి తెలియదు. అయితే నారా చంద్రబాబునాయుడు గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రబాబు గొప్పతనం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, నారావారిపల్లి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు నాయుడు చదువుకునే రోజుల్లోనే సెలవులు వచ్చినప్పుడు తోటల్లోకి వెళ్లి పనులు చేసేవాడు.

నాగలి పట్టేవారు అలాగే వరి కోతలు నూర్పిల్లు సమయంలో రాత్రి సమయాలలో అక్కడే పడుకునేవారు. దాదాపు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేవారు. తర్వాత యుక్త వయసులో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు ఉండటంతో వినాయక సంఘం సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ దశలోనే క్రియాశీలక రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1980లో పురావస్తు శాఖ, సినిమాటోగ్రఫీ,సాంకేతిక విద్య, పశు సంరక్షణ, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల మంత్రిగా తన పనులను సక్రమంగా నిర్వర్తించారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు తెలివితేటలు నచ్చడంతో ఎన్టీఆర్ చంద్రబాబునాయుడు దగ్గర చేసుకున్నారు.

 

చంద్రబాబు నాయుడు కూడా 1983లో సైకిల్ బాట పట్టారు. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ తో కలిసి జర్నీ చేశారు. 1994లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1995, సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రజలకు ఎన్నో రకాల మంచి పనులను చేశారు. ఈ నేపథ్యంలోనే జన్మభూమి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాడు. విజన్ 2020 అందరి దృష్టిని ఆకర్షించారు చంద్రబాబు. సీఎంగా ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ 1999లో రెండవసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయాన్ని సాధించారు. రైతు బజార్ అన్నది బాబు సెకల్లో మరో అధ్యయనం అని చెప్పవచ్చు. ఏ దశలో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ తరం వారితో కూడా పోటీ పడుతున్నారు చంద్రబాబు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -