Vishal: నటుడు విశాల్ గురించి ఈ షాకింగ్ విషయం తెలుసా?

Vishal: తమిళ స్టార్ హీరో విశాల్.. టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే. అయితే తమిళ సినీ రంగంలో ఎక్కువగా సినిమాలు తీసి.. టాలీవుడ్‌లో డబ్ చేస్తుంటారు. ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో సహాయ దర్శకుడిగా పని చేసిన విశాల్.. 2004లో ‘చెల్లమే’ సినిమాతో హీరోగా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు. టాలీవుడ్‌లో ‘పందెం కోడి, యాక్షన్, రాయుడు, డిటెక్టివ్, మగ మహారాజు, పూజ, వాడు వీడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లాఠీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సునయన నటిస్తోంది.

 

లాఠీ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను లాంఛ్ చేశారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ టీజర్‌ను విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..‘చాలా మంది హీరో విశాల్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ నేను అతడికి సంబంధించిన ఓ చెడు మాటను చెబుతాను. విశాల్‌కు ఒక జబ్బు ఉంది. అదే బడ్జెట్ జబ్బు. సినిమా స్టోరీని బట్టి ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు. షూటింగ్ ఎన్నిరోజులైనా పర్వాలేదు. బడ్జెట్‌ ఎంతైనా పర్వాలేదనే జబ్బు. నిజానికి ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళికి ఉంది. మా అబ్బాయి కూడా సినిమా స్టోరీ విషయంలో కాంప్రమైజ్ కాడు. దానికి తగ్గట్లు నిర్మాతలు కూడా బడ్జెట్ కేటాయిస్తారు. రాజమౌళి నుంచి ఆ జబ్బు విశాల్‌కు అంటుకున్నట్లు ఉంది. మా అబ్బాయి ఇప్పుడు ఎలా సక్సెస్ అందుకున్నాడో.. విశాల్ కూడా భారీ విజయాన్ని అందుకోవాలి.’ అని తెలిపారు.

 

 

ఇటీవల కార్తీకేయ-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వెళ్లానని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ‘కార్తికేయ-2 ఈవెంట్‌కి వెళ్లినప్పుడు అక్కడ పాజిటివ్ వైబ్స్ కనిపించాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -