Klin Kaara: క్లీంకార కేర్ టేకర్ నెల జీతం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Klin Kaara: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. కాగా ఉపాసన రాంచరణ్ లకు పెళ్లి అయిన దాదాపు పదేళ్ల తర్వాత క్లీంకార అనే పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ పాప ఏ ముహూర్తాన జన్మించిందో కానీ అప్పటినుంచి ఈ చిట్టి పాప పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తరచూ ఈ చిన్నారికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతెకాకుండా క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది అన్న మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. రామ్‌ చరణ్‌ RRR చిత్రానికి ఆస్కార్‌ అవార్డు దక్కితే తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డు దక్కింది.

 

మెగా ప్రిన్సెస్‌ రాకతో వారి కుటుంబంలో ఎప్పుడూ సందడిగానే ఉంది. దీంతో వారి ఫ్యాన్స్‌ కూడా సంబరపడిపోతుంటారు అయితే మెగా వారసురాలు అయిన క్లీంకారను చూసుకునేందుకు కేర్ టేకర్ ను నియిమించుకున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతోంది. ఆమె పేరు సావిత్రి కాగా, గతంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు అయిన తైమూర్‌కు సావిత్రి కేర్‌ టేకర్‌గా పనిచేసింది. ఆపై షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్‌ టేకర్‌గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్‌ అయిన ​క్లీంకార ఆలనా పాలనా చూసుకునేందుకు సావిత్రిని వారు నియిమించుకున్నారట. చాలా రోజుల క్రితమే రామ్‌ చరణ్‌ సొంత ఇంటిని నిర్మించుకుని షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన గేమ్‌ ఛేంజర్‌తో పాటు పలు ప్రాజెక్ట్‌ల వల్ల ఎప్పుడూ షూటింగ్‌ బిజీలో ఉంటారు. ఉపాసన కూడా ఆపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిత్యం బిజీగానే ఉంటారు. ఆ సమయంలో క్లీంకార కూడా ఎప్పుడూ ఉపాసన వెంటే ఉంటుంది. దీంతో పాపను చూసుకునేందుకు సావిత్రి అయితే బాగుంటుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూతురి కోసం లక్షలు లక్షలు వెచ్చించి ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారు ఉపాసన. చిన్నపిల్లలను సరిగ్గా అర్థం చేసుకుంటూ వారి ఆలనా పాలనను చూసుకునే సామర్థ్యం సావిత్రిలో ఉందని గతంలో కరీనా కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయింది. ప్రస్తుతం క్లీంకారకు కేర్‌ టేకర్‌గా ఉన్న పార్వతికి నెలకు లక్షన్నర జీతం ఇస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్‌చరణ్‌ దంపతులు వెళ్లారు. అప్పుడు ఒక పర్సనల్ పని మీద ముంబై వచ్చారని చరణ్ టీమ్​ మెంబర్ ఒకరు తెలిపారు. అప్పుడు పార్వతి కూడా వారితో ఉండటం గమనించవచ్చు. మరోక కార్యక్రంమంలో కూడా క్లీంకారతో ఆమె కనిపించడంతో మెగా వారసురాలికి కేర్‌ టేకర్‌గా సావిత్రి ఉందని వార్తలు వస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: ఆ సర్వేలను నమ్ముకుంటే వైసీపీ కథ కంచికే.. ఆ మాటలు నమ్మితే నిండా మునిగినట్లే?

YSRCP: ఇప్పటివరకు వచ్చిన సర్వేల ఫలితాలు రోజురోజుకీ వైసీపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అలాగే ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే జాతీయస్థాయిలో బీజేపీ ది, ఏపీలో వైసీపీ ది అధికారం...
- Advertisement -
- Advertisement -