Ram Charan: వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న చరణ్ అలాంటి రిస్క్ చేస్తారా?

Ram Charan: ఒకప్పుడు సౌత్ ఇండియా హీరోలు బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే అక్కడ వాళ్లకి మంచి గుర్తింపు వస్తుంది అని చాలామంది బాలీవుడ్ కి వెళ్ళిపోయారు. అదే విధంగా రామ్ చరణ్ కూడా వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య రామ్ చరణ్ ముంబైకి తెగ తిరిగేస్తున్నాడు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాంచరణ్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది.

 

అయితే రామ్ చరణ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. రాజ్ కుమార్ హిరానీ రెండు మూడు కథలు రాంచరణ్ కి చెప్పాడని, ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావడానికి టైం పడుతుందని బాలీవుడ్ లో వార్తలు కొనసాగాయి. మొన్న షారుక్ ఖాన్ నటించిన డుంకి ప్రమోషన్స్ లో ఒక ఫ్యాన్ ఈ విషయాన్ని నేరుగా రాజ్ కుమార్ హిరానీని అడగారు.

ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత రాంచరణ్ మంచి నటుడు అని అర్థమైంది కానీ అంతకుమించి ఇంకేమీ లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. దీని బట్టి అక్కడ ఉన్న వార్తలన్నీ రూమర్స్ అనే తెలుస్తుంది. అయినా ఏ భాషలో సినిమా తీసి డబ్బింగ్ చెప్పినా రామ్ చరణ్ కి ఉన్న గుర్తింపుకి కలెక్షన్లు బానే వస్తాయి అయినా సరే హిందీ డైరెక్టర్ల దగ్గరికి వెళ్లాలనే ఆశ ఏమిటో?

 

వరసగా రెండు 1000 కోట్ల సినిమాలను తీసిన షారుక్ ఖాన్ కి కూడా యావరేజ్ సినిమా డుంకిని ఇచ్చింది రాజకుమార్ హీరానీ నే. ఇకపోతే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా వచ్చే నెల షూటింగ్ కంప్లీట్ అవ్వబోతుంది. దాని తర్వాత బుచ్చిబాబుతో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కథని పట్టుకొని బుచ్చిబాబు రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా రామ్ చరణ్ స్పీడ్ పెంచాలి లేకపోతే తన అభిమానుల ఆశలపై నీళ్లు జల్లినట్టే అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -