Painful First time: తొలి కలయికలో నొప్పి ఉండకూడదు అంటే ఏం చేయాలో తెలుసా?

Painful First time: చాలామంది ఇతరులతో సెక్స్ విషయం గురించి డిస్కస్ చేయడానికి అంత కష్టపడరు. ఇతరులతో సెక్స్ విషయం గురించి సెక్స్ సమస్యల గురించి మాట్లాడడానికి మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు చాలామంది గూగుల్ లో వారి సమస్యలను సెర్చ్ చేసి వారికీ కావలసిన సమాధానాలు సమాధానాల్లో తెలుసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు వర్జినిటీ ఎలా కోల్పోతారు.. తొలి కలయిక నొప్పిగా ఉంటుందా? ఇలా అనేక రకాల డౌట్స్ గురించి గూగుల్ ద్వారా సమాధానాలు తెలుసుకుంటూ ఉంటారు.

 

ఇదే విషయం గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది సెక్స్ గురించి తెలుసుకుంటున్నారు. కానీ స్త్రీల హైమన్ పొర, యోనికి సంబంధించిన విషయాలను అసలు పట్టించుకోవడం లేదు. స్త్రీలు వర్జినిటీ కోల్పోవడం అంటే హైమన్ పొర చిరిగిపోవడమేనని చాలా మంది భావిస్తున్నారు. కానీ హైమన్ పొర ఎప్పటికీ చిరిగిపోదట. హైమన్ పొర చాలా సన్నగా ఉంటుంది. దీనిలో నుంచి రుతుస్రావం సమయంలో విడుదలయ్యే రక్తం లేదా యోనిలోని ద్రవాలు బయటకు వెళ్లేలా ఓ చిన్న రంధ్రం ఉంటుంది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇది ఇంకాస్త వెడల్పుగా తయారౌతుంది.

అంతే తప్ప హైమన్ పొర పూర్తిగా చిరిగిపోదు అంటున్నారు నిపుణులు. చాలామంది అమ్మాయిలు తొలిసారి కలయిక అంటే చాలా కంగారుపడి భయపడుతూ ఉంటారు. మొదటిసారి శృంగారం అయితే నొప్పి కలగడం అనేది సహజం. అయితే నొప్పి నుంచి బయట పడడానికి మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. తొలి కలయిక కంటే ముందు అమ్మాయిలకు హస్త ప్రయోగం అలవాటు ఉంటే తొలికలయిక పెద్దగా బాధించదట. అంతేకాకుండా శృంగారం మొదలుపెట్టేటప్పుడు ఫ్లోర్ ప్లేతో మొదలెడితే నొప్పి పెద్దగా తెలియదు.

తొలిసారి కలయిక తర్వాత రక్త స్రావం జరగుతుంది అనేది కూడా భ్రమే.

 

చాలా మంది గేమ్స్ లో పాల్గొనే అలవాటు, సైకిల్ తొక్కడం లాంటివి ముందే చేసి ఉంటారు. వాటి కారణంగా హైమన్ పొర ముందుగా సాధారణం కంటే కాస్త వెడల్పు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తొలికలయిక లో బ్లీడింగ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది అనుకుంటున్నట్టుగా సినిమాలలో చూపించిన విధంగా మెడికల్ పరీక్షలతో వర్జినిటీని ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు అంటున్నారు నిపుణులు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -