Tarak: తారక్ నాన్న అని పిలిచే మరో వ్యక్తి ఎవరో తెలుసా?

Tarak: టాలీవుడ్ లో ఎక్కువ మంది అభిమానులను కలిగిన హీరోల జాబితాలో మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉంటాడు. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచే ఎన్టీఆర్ ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. ఎంతో మంది అభిమానులు తమ ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ ని పూజిస్తుంటారు. అయితే అభిమానులు అంటే ఎన్టీఆర్ కు కూడా అంతే ప్రేమ. అందుకే ప్రతి మూవీ ఫంక్షన్ లో అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని చెబుతుంటాడు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా సెంటిమెంటల్ అనే విషయం ఇండస్ట్రీలోని చాలామందికి తెలుసు. తారక్ అందరినీ ఎంతో అభిమానిస్తాడని, అందరితో ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటాడని అందరికీ తెలుసు. అందుకే ఎవరికి ఏమైనా తట్టుకోలేడు. చాలా మూవీ ఫంక్షన్లలో తన కుటుంబ సభ్యుల గురించి, మరీ ముఖ్యంగా తన తల్లి, తండ్రి గురించి మాట్లాడితే ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతాడు.

 

తారక్ సినీ ఇండస్ట్రీలోనే కాదు, జీవితంలో ఎదగడానికి తండ్రి నందమూరి హరికృష్ణ ఎంతో కృషి చేశాడు. అందుకే ఎన్టీఆర్ కూడా చాలాసార్లు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాడు. తన తండ్రి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఆయన చెబుతూ ఉంటాడు. అయితే హరికృష్ణను నాన్న అని పిలిచే యంగ్ టైగర్.. అతడిని కాకుండా మరో వ్యక్తిని నాన్న అని పిలుస్తాడనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

 

తన తండ్రి నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఎన్టీఆర్ మరో వ్యక్తిని నాన్న అని పిలుస్తాడనే వార్త ఇప్పుడు అందరిలో చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ తన చిన్న కొడుకును ప్రేమతో నాన్న అని పిలుస్తాడట. తన తండ్రి మరణం తర్వాత తనకు దూరం కాలేదని, తన చిన్న కొడుకు రూపంలో తన దగ్గరే ఉన్నాడని ఎన్టీఆర్ భావిస్తాడట. అందుకే తన చిన్న కొడుకును నాన్న అని ఎన్టీఆర్ ప్రేమతో పిలుస్తాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -