AP CM: ఈ ముగ్గురిలో బెస్ట్ సీఎం ఎవరని ప్రజలు భావిస్తున్నారో తెలుసా?

AP CM: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు చాలా రసవతరంగా కొనసాగుతున్నాయి. నిత్యం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అధికారాన్ని అందుకోవాలని వైయస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఒకవైపు జనసేన పార్టీ మరోవైపు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో తమ పార్టీ జెండా ఎగురు వేస్తామంటూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎలాగైనా జగన్ పార్టీని పడగొట్టి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కించుకోవడం కోసం కష్టపడుతున్నారు.

 

ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ సీఎం అనే ప్రశ్న తలెత్తడంతో పలువురు వివిధ రకాల సమాధానాలను చెబుతున్నారు.ఇక ఈ విషయం గురించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోగా ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి సమాధానం చెబుతున్నారు.ముగ్గురు బెస్ట్ సీఎంలు అవుతారని అయితే కొన్ని మార్పులు చోటు చేసుకుంటే బాగుంటుంది అంటూ సలహాలు కూడా చెబుతున్నారు.

 

ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ సంక్షేమ పథకాలను అద్భుతంగా అందిస్తున్నారు. అయితే ఈయన రాష్ట్ర అభివృద్ధి వైపు కూడా ఆలోచన చేయాలని ఇలా అభివృద్ధి గురించి ఆలోచిస్తే ఈయన బెస్ట్ సీఎం అవుతారని తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచిస్తే ఈయన కూడా బెస్ట్ సీఎం అవుతారని తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ ముందుగా మేనిఫెస్టోను ప్రకటించి 2024 తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చి మంచి పరిపాలన అందిస్తే ఆయన బెస్ట్ సీఎం అవుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -