Birthday With Balayya: బాలయ్యతో పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Birthday With Balayya: టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్నారు బాలయ్య బాబు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవితో కలిసి ఒక అమ్మాయి పుట్టినరోజు జరుపుకుంది.

బాలయ్య దంపతులు ప్రత్యేకించి మరీ ఆ అమ్మాయి పుట్టినరోజు వేడుక జరిపారంటే ఖచ్చితంగా ఏ బంధువుల అమ్మాయో అని అనుకుంటున్నారా? కాదండోయ్ ఆ అమ్మాయి బాలయ్య బాబు వీరాభిమాని. అభిమానికి పుట్టినరోజు వేడుకలకు బాలయ్య బాబు రావడం ఏంటా అనుకుంటున్నారా. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్. బాలకృష్ణ. ఫ్యాన్స్ కోసం సినిమాల్లో ఎంత కష్టమైనా పడతారు. రియల్ లైఫ్ లో కూడా ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తారు బాలయ్య బాబు. అగ్ర హీరో అయినప్పటికీ ఎంతో సింపుల్ గా ఉంటారు బాలయ్య బాబు. అయితే మాములుగా ఫ్యాన్స్ అంత త్వరగా హీరోల దగ్గరకు వెళ్ళలేరు. వీరాభిమానులకు కూడా అభిమాన హీరోలను కలిసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది.

 

అలాంటిది అభిమాన హీరో అభిమాని పుట్టినరోజు వేడుక జరిపితే ఇంకేమైనా ఉందా? ప్రస్తుతం ఈ అమ్మాయి పరిస్థితి అదే. తన ఫేవరెట్ హీరో బాలకృష్ణలేడీ ఫ్యాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయించారు. అనంతరం బాలకృష్ణ, ఆయన సతీమణి అక్షింతలు వేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించారు. ఈ అరుదైన దృశ్యం యూఎస్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది. బాలకృష్ణ దంపతులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడ తానా మహాసభలు 2023లో పాల్గొన్నారు. చాలా ఘనంగా తానా మహాసభల వేడుక జరిగింది. బాలకృష్ణ ఎంట్రీ ఈ వేడుకకు హైలైట్ గా నిలిచింది. రాజసం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో బాలయ్య దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఒక లేడీ అభిమాని తన పుట్టినరోజు అని చెప్పగానే బాలకృష్ణ వెంటనే తన అభిమాని బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక స్టార్ హీరో ఇలా అభిమాని పుట్టినరోజు వేడుక జరపడం నిజంగా బాలయ్య గొప్పతనం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు బాలయ్య బాబు అభిమానులు ఇది కదా బాలయ్య బాబు అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -