Relationship: సెక్స్ చేసినా గర్భం రాకుండా ఉండాలా.. అయితే ఏం చేయాలో తెలుసా?

Relationship: సాధారణంగా చాలామంది భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత తొందరగా పిల్లలు పుట్టాలని కోరుకుంటే మరికొందరు లైఫ్ ని ఎంజాయ్ చేయాలని భావిస్తూ శృంగారానికి దూరంగా ఉంటారు. ఇంకొందరు మాత్రం శృంగారంలో పాల్గొంటూనే సేఫ్టీలను ఉపయోగిస్తూ ఉంటారు. శృంగారంలో పాల్గొంటూ పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం కొన్ని మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి ఉపయోగించడం వల్ల ఏమైనా జరుగుతుందేమో అని చాలామంది గర్భం వస్తుందన్న భయంతో సెక్స్ కు దూరంగా ఉంటారు. అయితే అది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు.

స్త్రీ, పురుష లైంగిక అవయవాలపై, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై సరైన అవగాహన ఉంటే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు అంటున్నారు.. గర్భ నిరోధానికి వాడే కొన్ని పద్ధతుల మీద అపోహలు చాలా ఉన్నాయి. మొదటిది సరైన టైంలో బైటికి తీయడం వల్ల గర్భం వచ్చే ఛాన్స్ ఉండదని అయితే ఇదంత నమ్మదగిన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటె ఆ సమయంలో మీ భాగస్వామి మరిచిపోయినా, కొంత వీర్యం లోపల పడిపోయినా ప్రమాదమే. అటువంటి సమయంలో లూప్ వంటి పద్ధతులు ఉపయోగించవచ్చు. అయితే ఈ లూప్ పద్ధతులు పిల్లలు కాని వారు ఉపయోగించకూడదు. మొదట పిల్లలు పుట్టి ఆ తర్వాత గ్యాప్ కావాలి అనుకున్నవారికి ఈ లుక్ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అయితే కలయికలో జారిపోవడం లేదా గర్భసంచి గోడలకు లైట్ గా టచ్ అవ్వడం లాంటి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.

 

అటువంటి సమయంలో కండోమ్స్ వాడడం అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి. ఇవి రరకరకాల ఆకారాలు, పరిమాణాల్లో దొరుకుతాయి. అనేక బ్రాండెడ్ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. అయితే ఇవి అందరికీ అంత సౌకర్యవంతంగా ఉండవు. వేడిని పుట్టిస్తాయి. వేడిని పుట్టించి, అసౌకర్యంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు.
పురుషాంగం బాగా గట్టి పడే వారితో శృంగారం చేసేప్పుడు కండోమ్‌లు ఆనందాన్ని తగ్గిస్తాయి, కొన్ని కండోమ్ లు చాలా టైట్ గా లేదా చాలా వదులుగా ఉంటాయి. దీనివల్ల శృంగారం పీక్ లో ఉన్నప్పుడు ఆపేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ భాగస్వామిలో ఆనందాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆడవారిలో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం ఓ పెద్ద సమస్యగా మారుతుంది. సమయానికి వేసుకోవడం మరిచిపోతే అది మళ్లీ గర్భదారణకు దారి తీస్తుంది. శృంగారం తరువాత 72 గంటల్లోపు వేసుకునే మాత్రలు కూడా ఉంటాయి. వీటివల్ల వందశాతం గర్భనిరోధం చేయచ్చు. కానీ ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. అంతేకాదు రెగ్యులర్ గా వాడడం అంత మంచిది కూడా కాదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -