ChandraBabu: ఏపీకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబే సీఎం కావాలా?

ChandraBabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి నిత్యం ఏదో ఒక విషయం గురించి అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది.ఇకపోతే వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎంతో యాక్టివ్ అయ్యి తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే మరోవైపు లోకేష్ పాదయాత్ర కూడా వచ్చే ఎన్నికలలో పార్టీకి ప్లస్ పాయింట్ అవ్వబోతుంది.

ఇక 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో భాగంగా వైయస్ఆర్సీపీ పార్టీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం అయింది.ఇలా గత ఎన్నికలలో భారీగా నష్టపోయిన పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చంద్రబాబు గురించి మాట్లాడుతూ చంద్రబాబు ముసలోడు అయ్యారని ఇక తనకు రిటైర్మెంట్ ఇవ్వడమే మంచిది అంటూ మాట్లాడుతున్నారు.

 

ఇక ఈ విషయంపై పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడని ఈయన హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగిందని అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని, ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుతుందని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు తెలియజేస్తున్నారు.

చంద్రబాబు ముసలోడు అని తక్కువ అంచనా వేయొద్దని ఆయన ప్లాన్స్ మాత్రమే ఏపీ భవిష్యత్తును మార్చగలవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే మాత్రమే ఏపీకి పూర్వ వైభవం వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరి వచ్చే ఎన్నికలలో అధికార పీఠాన్ని ఎవరు అందుకుంటారో తెలియాల్సి ఉంది. అయితే వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడం ఖాయం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేయగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలోనూ తమ జెండా ఎగరవేస్తాము అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -