TDP: కడప జిల్లాలో మెజారిటీ సీట్లు టీడీపీ సొంతమా.. జగన్ కు షాకేనా?

TDP: టిడిపి యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను కర్నూలు జిల్లాలో పూర్తిచేసుకుని జగన్ అడ్డా అయినా కడపలో అడుగుపెట్టబోతున్నారు. క‌ర్నూలు జిల్లాలో ఏప్రిల్ 12న లోకేశ్ పాద‌యాత్ర ప్ర‌వేశించింది. ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో 14 నియోజక వర్గాలలో 40 రోజుల పాటు పాదయాత్రను కొనసాగించారు. నేడు సాయంత్రం క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క వ‌ర్గంలోని సుద్ద‌ప‌ల్లిలో లోకేశ్ ఎంట‌ర్ అయ్యారు.

నేడు ఆళ్ల‌గ‌డ్డ మండ‌లం చిన్న‌కందుకూరు వ‌ద్ద పాద‌యాత్రతో ఆ జిల్లాలో పాద‌యాత్ర ముగుస్తూ కడప జిల్లాలోని అడుగు పెట్టబోతున్నారు. కడప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఒక‌ప్పుడు జ‌మ్మ‌ల‌మడుగు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గా ఉండేది. అయితే పార్టీ నాయకులలో వ్యతిరేకత రావటం వల్ల గత ఎన్నికలలో టిడిపి ఘోర పరాజయం పాలయింది.

 

2019లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా రామ‌సుబ్బారెడ్డి, క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా ఆదినారాయ‌ణ‌రెడ్డి ఓడిపోయారు. ప్ర‌స్తుతం రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ. జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్న కుమారుడు భూపేష్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. టిడిపితో పొత్తు ఉండటం వల్ల తనకు టికెట్ లభిస్తుందన్న ఆశతో ఆదినారాయణ రెడ్డి ఉన్నారు.

 

ప్రస్తుతం కడప జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ఇలా మారిన రాజకీయాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఇక జగన్ కంచుకోటలో లోకేష్ పాదయాత్ర ఎలా సాగిపోతుంది ఈయన ఎవరిని టార్గెట్ చేస్తూ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు అనే విషయాలు తెలియని ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -