Prabhas: ఆ ప్రముఖ హీరోకు ప్రభాస్ పై ఇంత పగ ఉందా?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తమ కష్టంతో పైకి వచ్చినవారు ఉన్నారు. ఇంకొందరు వారసత్వంగా వచ్చి ఎదిగిన వారు ఉన్నారు. కానీ కొందరు సినిమా బ్యాగ్రౌండ్ తో వచ్చి కష్టపడి స్టార్ గా నిలబడి ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరో ప్రభాస్ కూడా ఒకరు. అలనాటి హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈశ్వర్ సినిమా ద్వారా ఆయన మాస్ లుక్ లో తెలుగు ప్రేక్షకులకు కనిపించారు.

 

ఆ సినిమా తర్వాత వర్షం సినిమాతో ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ తన దైన మార్క్ ను ప్రభాస్ చూపించారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు.

 

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రాజెక్ట్ కేలో నటిస్తున్నారు. అలాగే మారుతి డైరెక్షన్ లో ఓ కామెడీ మూవీలో నటిస్తున్నారు. వరుస సినిమాలతో ప్రస్తుతం ప్రభాస్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

 

తాజాగా ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ప్రభాస్ ను తొక్కేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరో ప్రభాస్ గురించి బాలీవుడ్ లో నెగిటివ్ వార్తలు రావడం వెనుక ఆయనే కారణమని కూడా నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -