Adilabad: పసిపాప ఆకలి తీర్చడం కోసం ఏకంగా అలా చేస్తున్నారా?

Adilabad: ప్రపంచం, దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ మారుమాలు గ్రామాల్లో కనీస వసతులు లేవు. కేవలం ఓట్ల కోసం మాత్రమే నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్తారు, హామీ ఇస్తారే తప్ప వాటిని నెరవేర్చరు. అందుకే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో గూడెల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన వింటే కన్నీరు ఆగదు.

తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. అక్కడ నివసించే వారంతా, కడు పేదరికంలో ఉండేవారే. వారికి రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం, ఆసుపత్రుల సౌకర్యాలు ఉండవు. బంగారు తెలంగాణ అని చెప్పటం తప్ప పాలకులు ఆ ఏరియాలను పట్టించుకనే పాపాన పోరు. వీరు పట్టించుకోకనే ఆ గ్రామాల్లోని ప్రజలు కన్న అవస్తలు పడుతున్నారు.

 

ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని రాజుగూడకు చెందిన కొడప పారుబాయి జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబసభ్యులు పారుబాయితో పాటు పసికందును మరుసటి రోజున గూడేనికి తీసుకెళ్లారు. పది రోజులకే తల్లి అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటి నుంచి ఆ పసిపాప ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు పడరాని పాట్లు పడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు ప్రతిరోజూ రాజుగూడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని చిద్దరి ఖానాపూర్ వరకు కాలినడకన, అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లికి వాహనాల్లో వెళ్తూ పాల ప్యాకెట్ కొని తీసుకొస్తున్నారు.

 

ఈ గూడెంలో ఎవరికి ఆవుగానీ, మేకగానీ లేదు. దీంతో కనీసం పసిపాప ఆకలి తీర్చడానికైనా ఆవు మంజూరు చేయాలంటూ ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నామన్నారు. కానీ ఇప్పటి వరకూ మంజూరవలేదని బాపురావు తెలిపారు. ఇది చూసిన వారంతా తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -