Adilabad: సివిల్స్ లో సంచలన ఫలితాలు సొంతం చేసుకున్న కార్మికురాలి కొడుకు!

Adilabad: యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (2022 ) ఫలితాల్లో కుమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బనా మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దళిత బిడ్డ డోంగ్రి ఆల్ ఇండియా స్థాయిలో 410 ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో విశేషం ఏమిటి అంటారా. అతను ఒక దళిత బిడ్డ పైగా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లి వంట కార్మికురాలుగా పనిచేస్తూ కుమారుడిని చదివించుకుంది.

తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న రేవయ్య కష్టపడి చదివి ఈ ర్యాంకు సాధించాడు. రేవయ్య తండ్రి మనోహర్, తల్లి విస్తారుబాయి. రేవయ్య చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి తుంగెడలోని ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనులు చేస్తూ ముగ్గురు పిల్లలని ఉన్నత చదువులు చదివించింది.

 

కూతురు స్వప్న నాగపూర్ ఎన్ ఐ టి లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. పెద్ద కుమారుడు శ్రవణ్ అసిఫాబాద్ జిల్లా బిరియాని మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు డోంగ్రి రేవయ్య చిన్నతనం నుంచి బంధువుల ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు.

 

ఐదు నుంచి పదవ తరగతి వరకు ఆసిఫాబాద్లోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాదులోని నాగోల్ లో గల సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్ చదివాడు ఎంట్రన్స్ రాసి మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఓఎన్జిసి కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. అయితే గతసారి వచ్చిన ఫలితాల్లో కొద్ది మార్కులతో ర్యాంక్ మిస్ అయ్యాడు రేవయ్య.

 

తను చదువుకి ఆటంకంగా ఉన్నందుకు ఉద్యోగాన్ని సైతం పక్కనపెట్టి ఈసారి గరిట కష్టపడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాడు. మే 23న వచ్చిన ఫలితాల్లో 410 వ ర్యాంకు సాధించి అందరి దృష్టి తన మీద నిలిచేలాగా చేశాడు. అతని విజయం పై గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు కన్నతల్లి కష్టానికి ప్రతిఫలం అందించాడు అంటూ మెచ్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -