Adilabad: నాడు దినసరి కూలీ.. ఆ వ్యాపారంతో దూసుకుపోతున్నాడు!

Adilabad: కష్టపడే తత్వం ఉండాలి కానీ.. ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. మనం అనుకున్న లక్ష్యం సాధించడంలో విఫలమైతే.. మనలో ఉన్న ట్యాలెంట్‌ను వాడితే అంతకుమించి సాధించవచ్చుని వ్యాపార విజేతలు చెబుతున్నారు.. ఇదే తరహా ఓ యువకుడు ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని పట్టుపట్టి ప్రయత్నించగా అందులో విఫలమయ్యాడు. రెండవ సారి ప్రయత్నంలోనూ ఉద్యోగం సంపాదించలేకపోయాడు. అయినా కుంగిపోకుండా తనలోని ట్యాలెంట్, కష్టపడే మనసత్వాన్ని ఉపయోగించి తనదైన శైలిలో వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సందీప్‌.

ఆదిలాబాద్‌ జిల్లా తాంసీ మండల పరిధిలోని పొన్నారి గ్రామానికి చెందిన సందీప్‌ ఆర్మీ ఉద్యోగం కోసం రెండు సార్లు యత్నించగా విఫలమయ్యాడు. అయితే అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో తాను ఏం పని చేస్తే తన కుటుంబాన్ని సంతోషంగా బతుకగలదని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఆదిలాబాద్‌లో రోజుకు రూ. 80కు కార్పెంటర్‌గా పనిలో చేరాడు. ఆ పనిలో కావాల్సిన టిక్స్‌ను అతి తక్కువ సమయంలో నేర్చుకుని ఇంటికి వాడే ఆధునిక పరికరాలను తయారు చేస్తున్నాడు. కొత్త కొత్త పద్ధతుల్లో అల్యూమినియంతో కూడిన వాల్‌సీలింగ్, తలుపులు, కిటికీలు, వంటగదిలో ఉపయోగపడే పరికరాలను తయారు చేయడం ప్రారంభించాడు.

మొదట రూ. 80 రూపాయలకు పని చేర్చుకున్న సందీప్‌ అందులో రూ. 20 రూపాయలు రవాణా ఖర్చులకే పోయేవి. మిగతా వాటిని జమచేసి మొదట చిన్నచిన్న మెషిన్లు కొనుగోలు చేసి చిన్న దుకాణాన్ని ప్రారంభించి కొన్ని రోజుల తర్వాత గిరాకీ పెరగడంతో ఓ పెద్ద దుకాణం తెరిచి అందులో ఇద్దరు పని వాళ్లను పెట్టుకున్నాడు. వ్యవసాయం ఆధారమైన ఆ గ్రామానికి బయటి ప్రపంచం అంతగా టచ్‌లేదు. అలాంటి గ్రామానికి సందీప్‌ తన ప్రతిభను పేరుతెచ్చిపెట్టాడు. రోజుకు రూ.80కి దినసరిగా పనిచేసే సందీప్‌ ప్రస్తుతం ఒక దుకాణానికి ఓవర్‌ కావడంతో పాటు మరో ఇద్దరిని వర్కర్లు పెట్టుకుని శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -