Health Tips: రక్తహీనతతో బాధపడేవారు వీటిని తింటే సరిపోతుంది!

Health Tips: నేటి కాలంలో వయస్సు భేదం లేకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చాలా మందిలో రక్తహీనత సమస్య వేధిస్తోంది. అయితే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తిస్తే తీసుకునే ఆహారం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సూచనలను ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆ సమస్యను దూరం చసుకోవచ్చంటున్నారు.

మెంతులలో ఐరన్‌ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇవి రక్తహీనతను తగ్గించటానికి చాలా ఉపమయోగపడుతాయి. మెంతులలో కొవ్వులో కరిగే క్లోరోఫిల్‌ సమృద్ధిగా ఉండటంతో రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా మెంతులు తగ్గిస్తాయి. అందుకే ప్రతి రోజు సగం స్పూన్‌ మెంతులను నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌ రూట్‌లో కూడా ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది.

అందుకే దీని జ్యూస్‌ ప్రతి రోజు తీసుకుంటే రక్తహీనత సమస్యను త్వరితగతిన నయం చేసుకోవచ్చు. బీట్‌రూట్‌ రక్తంలో ఉండే ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచడంతో పాటు శరీరానికి అందాల్సిన ఫ్రెష్‌ ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. బీట్‌ రూట్‌ లో ఉండే విటమిన్‌–సీ శరీరం ఐరన్‌ని శోషించుకోవటానికి సహాయపడటంతో పాటు ఎర్ర రక్త కణాల పునరుత్పత్తికి దోహదపడుతోంది. కిస్‌మిస్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. కిస్‌ మిస్‌ తీసుకోవటం వలన రక్తహీనతను తగ్గించుకోవచ్చు.

ఇది హీమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడం మాత్రమే కాదు, రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రతి రోజు 5 కిస్‌మిస్‌ లను తినాలి. కిస్‌ మిస్‌ లను మామూలుగా తినవచ్చు. లేదంటే నానబెట్టి తినవచ్చు. బెల్లంలో కూడా ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది ఇది కూడా రక్త హీనతతో బాధపడుతున్న వారిలో ఐరన్‌ లేకపోవటం వలన అలసట, బలహీనత కలుగుతాయి. ప్రతి రోజు చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుంది. అయితే ఆర్గానిక్‌ బెల్లం తింటే మంచిది. ఆర్గానిక్‌ బెల్లం ముదురు రంగులో ఉంటుంది. ఖర్జూరంలో ఉండే ఐరన్‌ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ప్రతి రోజు రెండు ఖర్జూరాలను తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -