AP Election Dates: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరోజే ఏపీలో ఎన్నికలు.. లోక్ సభ పోలింగ్ ఎప్పుడంటే?

AP Election Dates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏపీ ఎన్నికలకు సంబంధించి అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఏపీ ఎన్నికల తేదీని ప్రకటించింది. మొత్తం ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం గమనార్హం.

ఏపీకి మే నెల 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలుగు రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలు సైతం ఒకేరోజు జరగనున్నాయి. మే నెల 13వ తేదీన ఏపీలోని 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలు మాత్రం ఏడు విడతల్లో జరగనున్నాయి.

ఏపీ ఎన్నికలకు సంబంధించి క్లారిటీ రావడంతో రేపటినుంచి పొలిటికల్ ప్రమోషన్స్ కార్యక్రమాలు పుంజుకోనున్నాయి. వైసీపీ, టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల గురించి దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమికే ఈ ఎన్నికల్లో ఎడ్జ్ ఉండబోతుందని తెలుస్తోంది. సర్వేల ఫలితాలు సైతం కూటమికే అనుకూలంగా ఉండటం గమనార్హం.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 88గా ఉంది. సోమవారం రోజున ఏపీ అసెంబ్లీ పోలింగ్ జరగనుండగా జూన్ 4 వతేదీ మంగళవారం రోజున కౌంటింగ్ జరగనుంది. మరోవైపు ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనుండగా ఈసారి ఏపీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -