AP Elections 2024: గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సైతం ఎన్నికల విధులు.. ఆ అభ్యంతరం లేదంటూ?

AP Elections 2024: త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇప్పటికే ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికలలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల అధికారులుగా నియమించకూడదు అంటూ ఇటీవల ప్రతిపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ విషయం గురించి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను తోసి పుచ్చింది.

ఏపీలో జరగబోయే ఎన్నికలలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ అధికారులు పాల్గొంటారని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇదే ఆదేశాలను జారీ చేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను విధులలో నియమించినప్పటికీ కొన్ని నియమాలు అమలు పరిచినట్లు తెలిపారు.

ఎన్నికల విధులలో పాల్గొని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కేవలం. ఆధార్ పోలింగ్ ఆఫీసర్స్ గా మాత్రమే బాధ్యతలు అప్ప చెప్పాలని తెలిపారు.. అంటే ఓటు వేసిన వారికి ఇంక్ పూయడం వంటి బాధ్యతలను మాత్రమే అప్పగించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ పార్టీలోనూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో కేవలం ఒక్కరే ఉండాలని తెలిపారు.

ఇక ఎవరైతే బూత్ స్థాయి అధికారులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉంటారో వారిని ఎట్టి పరిస్థితులలో కూడా పోలింగ్ పార్టీలోకి నియమించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక గ్రామ వాలంటీర్లు ఎక్కడ కూడా ఎన్నికల విధులలో పాల్గొనకూడదని సూచించారు.పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను నియమించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -