Ap Elections: ఏపీలో ఎన్నికలు జరిగే సమయం ఫిక్స్ అయిందా.. ఆరోజే లెక్కలు మారతాయా?

Ap Elections: ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి అంటే ఏప్రిల్ అంటూ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ను బట్టి చూస్తే అదే నిజం చెప్పవచ్చు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయం చెబుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణాకు ఒకేసారి ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తాజాగా ప్రకటించారు.
ఏప్రిల్ మొదటివారంలోనే ఏపీ తెలంగాణాలోని మొత్తం 42 ఎంపీ సీట్లకు ఒకే సారి ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

కిషన్ రెడ్డి చెప్పారు అంటే అందులో కొంత ఆధారం సహేతుకత లాజిక్ ఉంటాయి కాబట్టి ఈ ముహూర్తం ఖరారు అనే అనుకోవచ్చు. అయితే గతసారి అనగా 2019లో ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఆ తరువాత వారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇలా ఏపీలో ఎన్నికల పర్వం అంతా ఒక నెల పాటు సాగింది. ఈసారి కూడా అలాగే జరగనుంది అని అంటున్నారు. ఏపీ నుంచి మొదలెట్టి దేశంలో ఎనిమిది దశలుగా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు. గతసారి జరిగినట్లుగా ఏప్రిల్ 11న కాకుండా కొద్ది రోజులు ముందుకు ఎన్నికలు జరగవచ్చు అని అంటున్నారు.

 

అలాగే మార్చి నెల మొదట్లో కానీ ఫిబ్రవరి చివరిలో కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఎన్నికల నగరా ఏపీలో మోగడానికి గట్టిగానెల రోజుల టైం మాత్రమే ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీలో అపుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల హడావుడిలో పడిపోయాయి. టీడీపీ జనసేన కూడా అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీతో ఉన్నాయని అంటున్నారు. అలాగే ఏపీలో మొత్తం ప్రధాన పార్టీల అధినేతలు సభలు సమావేశాలకు సంబంధించి కూడా షెడ్యూల్ రెడీ అవుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -