AP Elections: ఏపీ ఎన్నికల్లో లెక్కలు మార్చేది ఆ పార్టీనా.. ఏమైందంటే?

AP Elections: ఏపీలో మరో 2 నెలల్లో జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా ఈ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ జగన్ ఫెయిల్యూర్స్ లాగే జరిగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన కలిసి కూటమి కట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా విపక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. పవన్ కల్యాణ్ రెండేళ్లుగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అందుకే.. ఎన్డీఏలో ఉండి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ, జనసేన కూటమి ఓవైపు వైసీపీ ఓవైపుగా జరిగే ఎన్నికల్లో పోరు హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. ఎందుకంటే.. జగన్ తనదైన మార్క్‌తో టికెట్ల అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అసమ్మతినేతలు రోడ్కెక్కినా.. ఎన్నికల సమయానికి అంతా సెట్ అయిపోతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. కానీ.. ఇంతవరకూ టీడీపీ, జనసేన టికెట్ల పంచాయితీ తెగలేదు. ఈ కూటమి టికెట్ల అనౌన్స్‌‌మెంట్ చేయడం ఎప్పుడో.. అసమ్మతి నేతలను బజ్జగించడం ఎప్పుడో అనే చర్చ నడుస్తోంది. ఇంతలో జగన్ వైసీపీని ఎలక్షన్ ట్రాక్ లోకి వందశాతం తీసుకొస్తారని రాజకీయ విశ్లేషణలు వినిపించాయి.

 

కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇంతవరకు గేమ్ ఛేంజర్‌గా ఉన్న టీడీపీ, జనసేన ప్లేస్‌లో షర్మిల వచ్చింది. ఖచ్చితంగా 2024 ఏపీ ఎన్నికలను షర్మిల ఎంట్రీకి ముందు.. షర్మిల ఎంట్రీ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఏపీ ఎన్నికలపై షర్మిల ప్రభావం అంత ఉంటుంది. వచ్చిన వెంటనే షర్మిల.. జగన్ పై విమర్శలు ఎక్కు పెట్టింది. టార్గెట్ జగన్ అనేలా పరిస్థితిని మార్చేసింది. ఎలాగైనా వైసీపీని గద్దే దించాలని కంకణం కట్టుకున్నట్టు షర్మిల దూకుడు చూపిస్తోంది. వైసీపీలోని అసంతృప్తులకు గాలం వేసేలా షర్మిల ప్రసంగాలు ఉన్నాయి. వైసీపీలో టికెట్ దక్కని వారితో ఇప్పటికే షర్మిల టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక జిల్లా పర్యటనకు కూడా షర్మిల రెడీ అయ్యారు కనుక.. ఆ పర్యటనల్లో వైసీపీ అసమ్మతి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

ఏపీలో ఎలాగైనా బలపడాలని చూస్తున్న కాంగ్రెస్‌కు షర్మిల రూపంలో మంచి అవకాశం దొరికింది. ఇంత వరకూ వైఎస్ పేరును కాంగ్రెస్ వాడుకొనే ప్రయత్నం చేసినా.. అది వర్క్ అవుట్ కాలేదు. కానీ.. ఇప్పుడు షర్మిల రూపంలో ఆ అవకాశం రానే వచ్చింది. షర్మిల కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ పైనే ఫోకస్ చేశారు. క్రిష్టయన్లు, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వైఎస్ అభిమానులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కాంగ్రెస్‌కు సీట్లు రాకపోయినా.. ఓట్లు మాత్రం గణనీయంగా వస్తాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుతుతోంది. కనీసం 4 నుంచి 5 శాతం ఓట్లు వచ్చినా.. వైసీపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి వైసీపీ ఓడిపోతే.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతాయని ఓ అంచనా.

 

చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నికల్లో జగన్ గెలుపును టైట్ చేస్తే.. షర్మిల వచ్చిన తర్వాత వైసీపీ ఓటమిని ఖాయం చేసిందని రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -