CM Jagan: సర్వేల లెక్కలు జగన్ ను వణికిస్తున్నాయా.. ఏం జరిగిందంటే?

CM Jagan: వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో కూడా తమ పార్టీ గెలుస్తుంది అంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన ఇదే వ్యాఖ్యలను ఎంతో ధీమాగా చెబుతున్నారు. ఇలా 175 స్థానాల్లోనూ తామే గెలుస్తాము అంటూ ఎంతో నమ్మకంతో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిలో రోజురోజుకు ఆ నమ్మకం చచ్చిపోతోందని తెలుస్తోంది. తాజా సర్వేలలో ఈసారి అధికారంలోకి టిడిపి జనసేన కూటమి రాబోతుందని తెలిసి జగన్ అయోమయంలో పడ్డారని తెలుస్తుంది.

ఈ విధంగా పలు సర్వేలలో జనసేన టిడిపి పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా ఈ పార్టీలతో బిజెపి కూడా పొత్తు కుదుర్చుకోవడానికి అడుగులు వేస్తుందనే విషయం జగన్మోహన్ రెడ్డిని మరింత కలవరపెడుతుందని తెలుస్తోంది. ఇలా పలు సర్వేలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రావడంతో ఆయన సోమవారం తాడేపల్లి నివాసంలో మరోసారి నియోజకవర్గ ఇన్చార్జిల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ సర్వేల ఫలితంగా మరోసారి నియోజకవర్గాలలో ఇన్చార్జిల మార్పుపై కూడా ఈయన పునరాలోచన చేశారని తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలను ఇప్పటికే నియమించినప్పటికీ వారిని కూడా మార్చే దిశలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని సమాచారం. ఇలా వివిధ రకాల సర్వేలలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఐపాక్ సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డికి నిరాశని ఎదురైందని తెలుస్తుంది.

ఈ విధంగా తన సొంత సర్వేలలో కూడా తనకు అనుకూలంగా రాకపోవడంతో జగన్ లో కలవర పాటు మొదలైందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి కేంద్ర పెద్దలను కలవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని సమాచారం. జగన్మోహన్ రెడ్డికి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడమే ఆలస్యం ఏ క్షణమైన ఢిల్లీ బయలుదేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో వైసిపికి కేవలం ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయనే విషయం వెల్లడించడంతో కేంద్ర పెద్దలు కూడా వైసిపితో జత కట్టడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -