YSRCP: వైసీపీతో అంటకాగే అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఈసీ.. పొలిటికల్ లెక్కలు మారుతున్నాయా?

YSRCP: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టు ఏపీలో పరిస్థితులు మారాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న అధికారులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎవరైనా రాజకీయ పార్టీలకు అనుకూలంగా విధులు నిర్వర్తిస్తే పోస్టింగ్ ఊడిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు.. ఇప్పటికే కొంతమందిపై చర్యలు కూడా ప్రారంభించింది.

ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. కాబట్టి ఉన్న వ్యవస్థలనే వాడుకోవాలి. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేది పోలీసులు, రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారులు ఎలక్టోరల్ అధికారులుగా ఉంటారు. ఇక పోలీసులు విషయానికి వస్తే.. ఎక్కడా అల్లర్లు జరగకుండా.. పోలీంగ్ ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలి. దీంతో.. అధికార వైసీపీ మొదటి నుంచి ఈ రెండు డిపార్ట్‌మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తమకు కావాల్సిన వారికి పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చి అధికారలు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా సర్వం సిద్దం చేసుకుంది. ఇలా పోస్టింగులు వచ్చిన వారు వైసీపీ సేవే ప్రజాసేవ అని భావించి అధికార పార్టీకి జీ హూజూర్ అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది.

ఇప్పటికే టీడీపీ, జనసేన మద్దతుదారుల ఓట్లు తొలగించడం .. వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లును తయారచేయడం వంటి వాటిలో ఇలాంటి అధికారులు కీలకంగా వ్యవహించారనే అనుమానాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఏపీలో దొంగఓట్ల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇలా ఓటర్ లిస్టులో అవకతవకలుపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేస్తే ఇందులో ఇన్వాల్వ్ అయిన అధికారుల్లో 90 శాతం మంది వైసీపీ నేతలు ఇచ్చిన ప్రమోషన్లతోనే ఉద్యోగం చేస్తున్నట్టు తేలింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ కలెక్టర్, ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో స్థాయి అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. అంతేకాదు.. ఇటీవల వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా చర్యలు మొదలు పెట్టింది.

పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టంలో గత వారం పోలీసులు కవాతు నిర్వహించారు. అయితే ఈ కవాతులో వైసీపీనే పాల్గొన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం స్థానిక ఎస్సై ను వీఆర్ పై పంపిచేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే ఈ తతంగం హడావుడిగా జరిగిపోయింది. లేదంటే.. ఈసీ అధికారులకు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో కూడా ఓ వీఆర్ఓ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇలా ఎవరైనా ఎంతటి వారైన ఈసీ అధికారులు వదలడం లేదు. ఎన్నికలు ప్రశాంతం, రాజ్యంగ బద్దంగా జరగాలని ఈసీ తేల్చి చెప్పింది. ఎవరైనా రాజ్యంగ బద్దంగా పని చేయలేకపోతే.. సెలవులు తీసుకొని వెళ్లిపోవచ్చిన స్పష్టం చేసింది.

తిరుపతి ఉపఎన్నికల్లో జరిగిన ఓటర్ లిస్టు అవకతవకలు కేసు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఓ ఐఏఎస్‌, మరో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో మరింత లోతైన విచారణ సాగుతోంది. ఏ క్షణాన ఏ అధికారిపై వేటు పడనుందోనన్న ఆందోళన ఆ ప్రాంత అధికారుల్లో నెలకొంది. రాజకీయ పార్టీ నేతలకు అంటకాగుతాం.. వైసీపీకి ఊడిగం చేస్తామంటే సస్సెన్షన్‌తో లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేస్తామని ఈసీ తేల్చి చెప్పింది. ఫీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగడానికి కావాల్సి చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచడం.. పోలింగ్ స్టేషన్ కు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం మాత్రమే తమ పని అని తేల్చిచెప్పింది. రాజకీయ పార్టీల కోసం పని చేయడానికి కార్యకర్తలు ఉంటారని చెప్పింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -