Chandrababu Naidu: చంద్రబాబు లెక్కల ప్రకారం ఏపీలో ఎన్నికలు అప్పుడేనట.. ఏం జరిగిందంటే?

Chandrababu Naidu: ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పాలి అయితే తాజాగా ఎన్నికలలో భాగంగా ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యి ఎన్నికలకు విషయంలో నేతలందరికీ కొన్ని కీలక విషయాలను తెలియజేశారు. ఎన్నికలలో ఎలాగైనా గెలపొందడం కోసం పార్టీ నేతలకు దిశా నిర్దేశాలు పార్టీ ప్రణాళికలను అందరితో పంచుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలను ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు మరో 56 రోజులలో ఎన్నికలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఇలా బాబు అంచనా వేస్తూ 56 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారా లేక పక్కా సమాచారం ఆయనకు తెలిసే ఇలా మాట్లాడారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం 56 రోజులు అంటే సరిగా ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికలు జరుగుతాయి అయితే ఈయనకు ఎన్నికల తేదీ గురించి పక్కా సమాచారం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గత నాలుగున్నర దశబ్ద కాలంగా రాజకీయాలలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు ఎన్నికలపై చాలా అవగాహన ఉంటుంది అంతేకాకుండా బీజేపీతో చాలా చనువుగా ఉంటున్నటువంటి తరుణంలో పక్కా సమాచారం ఆయనకు తెలిసే ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

ఇలా ఎన్నికలు తేదీ ముందే తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు వైసిపి కుంభస్థలం బద్దలు కొట్టడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారని ఇందులో భాగమే ఉండవల్లి నివాసంలో పార్టీ నేతలతో సమావేశమని పలువురు భావిస్తున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కనుక ఆయన ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నారని పలువురు భావిస్తున్నారు.

నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 56 స్థానాలకు జరుగుతున్నాయి. దాంతో రాజ్యసభ ఎన్నికల తరువాత కానీ కేంద్ర ఎన్నికల సంఘం వేరే ఆలోచనలు పెట్టుకునే చాన్స్ లేదు. ఎన్నికలు పూర్తికాగానే ఏప్రిల్ 10వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత వారం నామినేషన్ ప్రక్రియలను పూర్తి చేయబోతున్నారని ఈ లెక్క ప్రకారం ఏప్రిల్ లోనే ఎన్నికలు జరగబోతున్నాయని కూడా స్పష్టమవుతుంది. మరి ఎన్నికల తేదీని అంచనా వేస్తూ అన్ని పార్టీ నేతలు కూడా ఎన్నికల హడావిడిలో మునిగారు. మరి ఈసారి ఎన్నికల హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -