Balayya: 63 ఏళ్ల వయస్సులో కూడా బాలయ్య అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు.. టాలెంట్ కు ఫిదా అవ్వాలంటూ?

Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. 63 ఏళ్ల వయసు అయినా కూడా బాలయ్య బాబులు క్రేజ్ జోరు ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

బాలయ్య గత రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిన విషయం తెలిసిందే. త్వరలోనే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా ఆ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన విజయం తెలిసిందే. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూతురి పాత్రలో నటించింది.
భగవంత్‌ కేసరి అక్టోబర్ 19న‌ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అవుతుంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబుకి సంబంధించి ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో బాలయ్య నటి పూర్ణతో కలిసి నందమూరి నాయక పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. 63 ఏళ్ల వయసులో కూడా బాలయ్య తగ్గేదెలా అన్నట్టుగా డ్యాన్స్‌ చేశాడు.

 

అసలు బాలయ్య ఎనర్జీ చూస్తుంటే బాలయ్య వయసు 63 సంవత్సరాలా లేదా 33 సంవత్సరాలా అన్నట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది కదా బాలయ్య బాబు అంటే అంటూ జై బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -